Parliament Monsoon Sessions Begins: Live Updates - Sakshi
Sakshi News home page

Parliament Monsoon Sessions: పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా

Published Thu, Jul 20 2023 11:22 AM | Last Updated on Thu, Jul 20 2023 2:14 PM

Parliament Monsoon Sessions Begins Live Updates - Sakshi

Updates..

పార్లమెంట్‌ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. మణిపూర్‌ ఘటనపై చర్యలు విపక్షాలు  పట్టుపట్టడంతో.. ఆందోళనలతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు

► రాజ్యసభ సభలో గందరగోళం నెలకొంది. మణిపూర్‌ ఘటనపై చర్చకు టీఎంసీ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో మణిపూర్‌ ఘటనపై సభలో మోదీ ఎందుకు మాట్లాడరని టీఎం సభ్యులు ప్రశ్నించారు. దీంతో, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.   

► మణిపూర్‌ ఘటనపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై ఒవైసీ పార్లమెంట్‌ వద్ద మాట్లాడుతూ.. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది. అక్కడ నరమేధం జరుగుతోంది. మణిపూర్‌ సీఎంను తొలగించి, సీబీఐ విచారణకు ప్రధాని ఆదేశించినప్పుడే న్యాయం జరుగుతుంది అని అన్నారు. 

► కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. 

► మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ వాయిదా. 

► మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా. 

► ఇటీవల కన్నుమూసిన పార్లమెంట్‌ సభ్యులకు నివాళిగా రెండు సభాలు వాయిదా. 

► ఆప్ ఎంపీగా లోక్‌సభలో సుశీల్‌ కుమార్‌ రింకూ ప్రమాణం చేశారు.

► పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం. ‍ స్పీకర్‌ స్థానంలో ఓం బిర్లా కూర్చుని సెషన్స్‌ని ప్రారంభించారు. 

► మణిపూర్‌ ఘటనపై మోదీ సీరియస్‌ అయ్యారు. 

► మణిపూర్‌ ఘటన బాధాకరం. ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటన కలచివేసింది. మణిపూర్‌ రేపిస్టులను వదిలిపెట్టే ప్రస‍క్తే లేదు.

 మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. మణిపూర్‌ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. 

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక, పార్లమెంట్‌ సమావేశాల సందర్బంగా సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement