PM Modi Lays Foundation For 508 Railway Stations Under Amrit Bharat - Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులను తలదన్నేలా రైల్వేస్టేషన్లు.. ఏపీలో 18, తెలంగాణలో 21.. శంకుస్థాపన చేసిన ప్రధాని

Published Sun, Aug 6 2023 2:02 PM | Last Updated on Sun, Aug 6 2023 2:47 PM

PM Lays Foundation For 508 Railway Stations Under Amrit Bharat - Sakshi

న్యూఢిల్లీ: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలోని పలు రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.  మొత్తం 508 రేల్వే స్టేషన్లను రూ.24,470 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు తెలిపారు ప్రధాని.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పునర్నిర్మించనున్న 1309 రైల్వేస్టేషన్ల పనులకు ఆదివారం ప్రధానమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా మొదట విడతలో 508 రైల్వే స్టేషన్ల పనులు మొదలుకానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.24,470 కోట్లను కేటాయించినట్లు తెలిపారు ప్రధాన మంత్రి. 

మొదటి విడతలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లను తెలంగాణలోని 39 స్టేషన్లకు గాను మొదట 21 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ఏపీలోని రైల్వే స్టేషన్లకు  రూ.453 కోట్లు తెలంగాణలోని రైల్వే స్టేషన్లకు రూ.893 కోట్ల నిధులతో రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల తరహాలో ప్లాజా మోడల్‌లో  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మించనున్నారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే స్టేషన్లను పునరుద్ధరించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో.. 
ఏపీలో కాకినాడ టౌన్ జంక్షన్, తుని, పిడుగురాళ్ల, రేపల్లె, తెనాలి, కర్నూలు సిటీ, దొనకొండ, ఒంగోలు, సింగరాయకొండ, పలాస, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం జంక్షన్, భీమవరం టౌన్, ఏలూరు, నరసపూర్, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం స్టేషన్లు..  తెలంగాణలో ఆదిలాబాద్, హనుమకొండ కాజీపేట జంక్షన్, హఫీజ్ పేట, హప్పుగూడ, హైదరాబాద్, మలక్ పేట, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్, మహబూబాబాద్ హైటెక్ సిటీ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, జహీరాబాద్, పెద్దపల్లి రామగుండం, మల్కాజిగిరి జంక్షన్, వికారాబాద్ తాండూరు, యాదాద్రి స్టేషన్లను ఆధునీకరించనున్నారు. 

ఏపీ, తెలంగాణ మినహాయించి రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్ లో 21, జార్ఖండ్‌లో 20, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. 

ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి మొత్తం భారతదేశం వైపే ఉందన్నారు. ప్రపంచస్థాయిలో భారత ప్రతిష్ట పెరిగిందని, ప్రపంచం దృష్టిలో భారతదేశ స్థాయి కూడా పెరిగిందని అన్నారు. దీని వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి.. మొదటిది సుమారు 30 ఏళ్ల తర్వాత భారత్ దేశంలో ఒక ప్రభుత్వం పూర్తి స్థాయి మెజారిటీ సాధించడం కాగా రెండవది పూర్తి స్థాయి మెజారిటీ సాధించిన ప్రభుత్వం సవాళ్ళను స్వీకరించి కీలక నిర్ణయాలు తీసుకుని నిర్విరామంగా పనిచేయడమేనని అన్నారు. 

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ వధువు, భారత వరుడు.. మరో జంట కథ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement