కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన మెగా ర్యాలీలో పాల్గొనడానికి కలబురగి జిల్లాకు వెళ్లారు. మోదీకి పార్టీ సీనియర్ నాయకులు ప్రహ్లాద్ జోషి, బీవై విజయేంద్ర తదితరులు స్వాగతం పలికి సన్మానించారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక ఇప్పటికే సంకల్పించిందని మోదీ పేర్కొన్నారు. ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఉత్సాహం బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంటుందని చెబుతోంది. ఈ సారి 400 సీట్లను తప్పకుండా గెలుస్తామని మోదీ మరోసారి పేర్కొన్నారు.
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు కురిపిస్తూ.. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారిందన్నారు. రాష్ట్రంలో సంఘ వ్యతిరేకులకు రక్షణ కల్పిస్తున్నారు. కాంగ్రెస్‌పై మీ అందరికీ ఉన్న కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాంటి పార్టీ వారు ఎన్ని బట్టలు మార్చుకున్నా తమ కార్యకలాపాలు మారవు. బొగ్గు నల్లదనాన్ని తొలగించవచ్చు కానీ అవినీతిని కాంగ్రెస్ నుంచి వేరు చేయలేమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment