సాక్షి, న్యూఢిల్లీ: ప్రతి కేసుకూ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) వినియోగించడమా అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. అలా చేయడం వల్ల చట్టం నిరుపయోగం అవుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ రాజును ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. పీఎంఎల్‌ఏ చట్టం కేసులో నరేందర్ పటేల్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం విచారించింది. చట్టాన్ని నీరుకారుస్తున్నారని, రూ.10,000 కేసు, రూ.100 కేసుకు కూడా ఈ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగిస్తే ప్రయోజనం ఏంటని జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment