
సాక్షి, న్యూఢిల్లీ: ఉప సభాపతిగా ఎన్నికైనా హరివంశ్ నారాయణ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఇవాళ(సోమవారం) హరివంశ్ నారాయణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కూడా ఆయనకు శుభకాంక్షలు తెలిపారు. అధికార, విపక్షాలకు మధ్య సమతుల్యం పాటించినప్పుడే చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌గా విజయవంతం అవుతారని విజయసాయిరెడ్డి అన్నారు. గతంలోనూ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నికయ్యారని, వైఎస్సార్ సీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు ఆయన మంచి సమయం కేటాయించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. (రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక)