
ఇటీవల పెళ్లిలో జరుగుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు వధువుకు సంబంధించినవి ఉండగా, మరొకొన్ని వరుడువి, ఇంకొన్ని సందర్భాల్లో వధూవరులు ఇద్దరివీ ఉంటున్నాయి. ఆ మంటపంలో ఎవరో ఒకరు ఆ వేడుకల్ని వీడియో తీసి అందరికీ షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని నెట్టింట దర్శనమిస్తూ వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలే. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
అందులో.. వధువు, వరుడు వేదికపై కూర్చొని ఉన్నారు. వివాహానికి విచ్చేసిన అతిథిలు.. కొత్త జంటకు విషెస్ చెబుతూ బహుమతులను ఇస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం అందరి ముందే ఓపెన్ చెయ్యాలని వధువుని కోరారు. దీంతో అందులో ఏదో ప్రత్యేకమైన వస్తువు ఉంటుందని అందరూ ఆసక్తిగా చూడసాగారు. తీరా వధువు ఆ గిఫ్ట్ బాక్సును ఓపెన్ చేసి చూడగా.. చపాతీ కర్రను ఉండడంతో ఓ వైపు షాక్‌కు గురి కాగా మరో వైపు నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: వరుడిని చూసి పట్టరాని సంతోషంతో గాల్లో ముద్దులు పంపిన వధువు
Comments
Please login to add a commentAdd a comment