వచ్చే ఏడాదిలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు గెలిచి అధికారం చేపట్టిన బీజేపీ.. మూడోసారి కూడా కేంద్రలో పాగా వేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మళ్లీ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే అంచనా వేసింది. బీజేపీకి సొంతంగా 285 నుంచి 325 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది.
#JanGanKaMann: आज लोकसभा चुनाव हुए तो किसको कितनी सीटें? #BJP+ 285-325#INC 111-149#TMC 20-22#YSRCP 24-25#BJD 12-14#BRS 9-11 #AAP 4-7#SP 4-8
— Times Now Navbharat (@TNNavbharat) July 1, 2023
अन्य 18-38@ETG_Research @PadmajaJoshi #Survey #Elections pic.twitter.com/pqCKhSTGbK
టైమ్స్ నౌ సర్వే ప్రకారం
► బీజేపీ.. 285-325
►కాంగ్రెస్.. 111-149
►తృణమూల్ కాంగ్రెస్.. 20-22
►వైఎస్సార్‌సీపీ.. 24-25
►బీజేడీ.. 12-14
►బీఆర్‌ఎస్ 9-11
►ఆమ్ ఆద్మా పార్టీ.. 4-7
►సమాజ్‌వాదీ పార్టీ.. 4-8
►ఇతరులు.. 18-38
మొత్తం 543 స్థానాలున్న లోక్‌సభలో అధికారంలోకి రావాలంటే కనీసం 272 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. గత రెండు పర్యాయాలు 2014లో, 2019లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ నేతృత్వంలో మరిన్ని పార్టీలను మిత్ర పక్షాలుగా చేర్చుకుంది. ఇక ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. 9 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా.. మోదీ సర్కారుకు ఇప్పటికీ ధృడంగానే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది టైమ్స్ నౌ నవభారత్ సర్వే సారాంశం.
ఇక కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్‌కు కావాల్సినన్ని సీట్లను గెలిపించలేకపోతున్నారని సర్వే చెబుతోంది. కర్ణాటకలో గెలిచినా.. రాహుల్ ప్రభావం దేశవ్యాప్తంగా ఇంకా రాలేదని తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 111 నుంచి 149 సీట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది.
దేశవ్యాప్తంగా అత్యధిక లోక్‌సభ సీట్లు దక్కించుకునే పార్టీగా YSRCP అవతరించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. జాతీయ పార్టీల తర్వాత ఏకంగా 24 నుంచి 25 స్థానాలను YSRCP గెలుచుకుంటుందని అంచనా వేసింది. బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ 20 నుంచి 22కు పరిమితం అవుతారని తెలిపింది. ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారంలో ఉన్న ఆమ్ అద్మీకి 4 నుంచి 7 రావడం కష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment