లక్నో: బీజేపీ, ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. అయితే, అయోధ్యలో మౌళిక సదుపాయాల విషయంలో స్థానికులు, భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్యలో పరిస్థితులను తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పీడబ్ల్యూడీ ఇంజనీర్లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేశారు. అలాగే, అయోధ్యలో 14 కిలోమీటర్ల మేర గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయోధ్యకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్యలో మోకాళ్లలోతు నీటితో రోడ్లు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రామమందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు మునిగిపోయాయి. స్థానికులు మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు. వర్షం పడిన ప్రతిసారీ తమకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కూడా కష్టాలు పడుతున్నారని చెబుతున్నారు. వర్షం కారణంగా వీధులు పూర్తి బురదమయంగా ఉండడంతో బైకులు, ఇతర వాహనాలు వీధుల్లోకి రాలేవని పేర్కొంటున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ये जो हर तरफ़ ‘भ्रष्टाचार का सैलाब’ है
उसके लिए भाजपा सरकार ज़िम्मेदार है#Ayodhya pic.twitter.com/LroA87UUTr— Akhilesh Yadav (@yadavakhilesh) June 28, 2024
మరోవైపు, అయోధ్యలో ఇటీవల కురిసిన వర్షానికి ఆలయంలో వర్షపు నీరు లీకేజీ అవుతున్నట్టు ఆలయ ప్రధాన పూజారి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పైకప్పు నుండి వర్షపు నీరు ఆలయం లోపలికి చేరుతోందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాటు కూడా లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందిస్తూ వర్షం నీరు వెళ్లేందుకు ఆలయంలో అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
Corruption! Corruption! Corruption!
🚨The first rain in Ayodhya exposed the claims of development, more than 10 potholes appeared on RAMPATH. pic.twitter.com/38YLCHJy4A— Gems of Engineering (@gemsofbabus_) June 28, 2024
Comments
Please login to add a commentAdd a comment