సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రచారానికి కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఎప్పటికప్పుడు తమ సన్నిహితులతో కలిసి ప్రచారం ముగిసిన తరువాత అర్ధరాత్రి సమయంలో తమకు నమ్మకమైన అనుచరులతో కలిసి ఎత్తుగడలపై ఆలోచనలు చేస్తున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల ముఖాముఖి పోరు నెలకొని ఉండగా, మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ముఖాముఖి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రత్యర్థి ప్రచారం, వ్యూహాలు, ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనించేందుకు గాను ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీలో తమ కోవర్టులను సైతం ఏర్పాటు చేసుకుని వారిచ్చే సమాచారం ఆధారంగా ప్రణాళికలు రచిస్తున్నారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకుంటూ ముందుకు కదులుతున్నారు.ఎక్కడికక్కడ సొంత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్లాన్లు మార్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాన్సువాడ, జుక్కల్, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థులకు, ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థికి చివరి రోజు టిక్కెట్లు కేటాయించడంతో వారికి మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే తగినంత సమయం లభించలేదు. దీంతో పరిమిత సమయాన్ని సా
మైనంతగా సద్వినియోగం చేసుకునే దిశగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా చివరి నిముషంలో టిక్కెట్లు దక్కించుకున్న వారిలో కొందరు అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గాల నుంచి నియోజకవర్గాలకు వలస వెళ్లారు. అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని అక్కడి ప్రత్యర్థిని ఏవిధంగా ఢీకొట్టాలనే విషయమై ప్రత్యేకంగా వార్‌రూం ఏర్పాటు చేసుకుని మరీ ముందుకు కదులుతున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండగా పార్టీ వేవ్‌తో పాటు అభ్యర్థి గెలుపోటముల లెక్కలు గంటగంటకూ మారుతున్నాయి. దీంతో అభ్యర్థులు మరింత హడావుడి పడుతున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తున్నప్పటికీ ఆ ప్రభావం లేకపోవడంతో బీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో మరింత సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుత వేవ్ కొనసాగుతుందా లేదా అనే దిశగా కాంగ్రెస్ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. జాతీయ నేతల పర్యటనలతో తమకు లబ్ధి కలుగుతుందనే భావనతో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు వ్యూహాలకు మరింత పదును పెట్టుకుంటున్నారు.
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థుల ప్రచారం, వ్యూహాలు, ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనించేందుకు సొంత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకుంటూ ముందుకు కదులుతున్నారు.త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మా త్రం అభ్యర్థులు కూడికలు, తీసివేతలతో అందు కు తగిన విశ్లేషణలు చేసుకుంటూ వస్తున్నారు.
తమకు ప్రత్యర్థులుగా ఉన్నవారిలో ఏ అభ్యర్థి, ఏ వర్గానికి చెందిన ఎన్ని ఓట్లను చీల్చుకుంటార నే విషయమై విశ్లేషణలు చేసుకుంటున్నారు. త్రిముఖ పోరులో ఏ అభ్యర్థి ఏ వర్గానికి చెందిన ఓట్లను చీల్చితే తమకు ప్రయోజనం కలుగుతుందో, లేనిపక్షంలో తమకు ఏమైనా నష్టం క లుగుతుందా అనే విషయమై లెక్కలు వేసుకుంటున్నారు. కౌంట్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో మరింత హడావుడిగా పనులు చక్కబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment