అనర్హులకు ఆత్మీయ భరోసా! | - | Sakshi
Sakshi News home page

అనర్హులకు ఆత్మీయ భరోసా!

Published Wed, Jan 29 2025 2:03 AM | Last Updated on Wed, Jan 29 2025 2:03 AM

అనర్హులకు ఆత్మీయ భరోసా!

అనర్హులకు ఆత్మీయ భరోసా!

గ్రామసభల్లో వెల్లడైన పేర్లు

మరోసారి పరిశీలిస్తామంటున్న

అధికారులు

జిల్లాలో ఇప్పటికే 3వేల మంది

పేర్లు బహిర్గతం

మోర్తాడ్‌(బాల్కొండ): మోర్తాడ్‌ మండలంలోని వడ్యాట్‌లో ఓ విద్యార్థికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం మంజూరైనట్లు గ్రామసభ ద్వారా వెల్లడైంది. అలాగే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబంలోని యువకుడికి ఆత్మీయ భరోసా మంజూరైనట్లు జాబి తాలో అధికారులు వెల్లడించడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు సాయం అందించాల్సి ఉండగా ఆర్థికంగా ఉన్నవారి పేర్లు జాబితాల్లో కనిపించడం గందరగోళానికి దారి తీ సింది. ఇది ఒక్క వడ్యాట్‌లోనే చోటు చేసుకున్న ఘటన కాదు. జిల్లాలో అనేక చోట్ల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు నమోదు కావడంతో పథకం పక్కదారి పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

● భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు నిర్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనర్హులకు అందిస్తే ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతుందనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో 42 వేల మందిని ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేయగా నాలుగు రోజులపాటు నిర్వహించిన గ్రామ సభల్లో 3 వేల మంది అనర్హులు ఉన్నట్లు తేలింది. జిల్లాలో 530 (కొత్తవి కాకుండా) గ్రామ పంచాయతీల పరిధిలో 2023లో చేపట్టిన ఉపాధి పను ల్లో కనీసం 20 రోజు లపాటు హాజరైన కు టుంబాలను పరిగణనలోకి తీసుకుని ఆత్మీయ భరోసా లబ్ధిదారుల జా బితాను రూపొందించారు. అప్పట్లో 85 వేల కు టుంబాలు ఉపాధి పనుల్లో పాల్గొన్నా యి. ఉపాధి కూలీల కుటుంబాల జాబ్‌కార్డులను ధరణి వెబ్‌పోర్టల్‌తో అనుసంధానం చేసి 42వేల మందికి భూమి లేదని గుర్తించారు. ధరణి వెబ్‌పోర్టల్‌, జాబ్‌కార్డుల అనుసంధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భూమి ఉన్నవారికి కూడా ఆత్మీయ భరోసా మంజూరైనట్లు జాబితాల్లో బహిర్గతమైంది.

అర్హులకే అందిస్తాం

అర్హులకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం అందుతుంది. ఎంపీడీవోల ద్వారా మరోసారి అనర్హులను ఏరివేసే ప్రక్రియ నిర్వహిస్తాం. గ్రామ సభల్లో జాబితాలను బహిర్గతం చేయడం ద్వారా అర్హులు, అనర్హులను గుర్తిస్తున్నాం. ఆత్మీయ భరోసా పథకాన్ని వంద శాతం అర్హులకే వర్తింపజేస్తాం.

– సాయాగౌడ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement