ఎండబెట్టిన పసుపు తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

ఎండబెట్టిన పసుపు తీసుకురావాలి

Published Wed, Jan 29 2025 2:03 AM | Last Updated on Wed, Jan 29 2025 2:03 AM

ఎండబె

ఎండబెట్టిన పసుపు తీసుకురావాలి

సుభాష్‌నగర్‌: ఎండబెట్టిన పసుపును మాత్రమే మార్కెట్‌యార్డుకు తీసుకు రావాలని నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి రైతులకు సూచించారు. అధికారులతో కలిసి నగరంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌లో పసుపు కల్లాలను గంగారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండిన పసుపును తీసుకొస్తే రూ.10వేలకుపైగా ధర దక్కేలా మార్కెట్‌ కమిటీ కృషి చేస్తుందన్నారు. మార్కెట్‌యార్డుకు ఇప్పుడిప్పుడే పసుపు పంటను రైతులు తీసుకొస్తున్నారని, పచ్చిగా ఉన్న పసుపునకు లాట్‌ ఐడీలు ఇవ్వకుండా తిరిగి పంపిస్తున్నామని తెలిపారు. 12 శాతం తేమ ఉన్న పసుపు తీసుకొచ్చి రైతులు మార్కెట్‌ కమిటీకి సహకరించాలని కోరారు. ఆయనవెంట మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మల్లేశ్‌, సూపరింటెండెంట్‌ లాబన్‌, సిబ్బంది శంకర్‌ దాస్‌, గురుదాస్‌రెడ్డి, తదితరులున్నారు.

చిన్నపిల్లల్లో క్షయవ్యాప్తిని అరికట్టాలి

నిజామాబాద్‌నాగారం: చిన్న పిల్లల్లో క్షయ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి రాజ శ్రీ అన్నారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గ్లోబల్‌ ఫండ్‌, సాతి, టీబీ అలర్ట్‌ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా స్థా యిలో పిల్లల వైద్యులు, స్టాఫ్‌ నర్సులకు, ఎన్టీ ఈపీ సిబ్బందికి మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జీజీహెచ్‌లో నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రతి ఆస్పత్రిలో క్షయ నివారణకు సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రమేశ్‌, అంజన, రాజు, సూపరింటెండెంట్‌ లు శ్రీనివాస్‌, శ్రీనివాస్‌ ప్రసాద్‌, జిల్లా క్షయ నిర్మూలన అధికారి దేవీనాగేశ్వరి, రీసోర్స్‌ పర్సన్‌, పిల్లల వైద్యులు శ్రీశైలం, హరిప్రియ, ఐఎంఏ అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎండబెట్టిన పసుపు తీసుకురావాలి 1
1/1

ఎండబెట్టిన పసుపు తీసుకురావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement