బైక్ వెంట పడిన చిరుత
ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలం తాడెం ఎస్బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తున్న మదూత్ విధులు ముగించుకొని బైక్‌పై జిల్లా కేంద్రానికి వస్తుండగా చిరుత వెంటపడింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా లారీ, ఓ బైక్ రావడంతో చిరుత పక్కనే ఉన్న గుట్టల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై అటవీ అధికారి ప్రతాప్‌ను సంప్రదించగా చిరుత వెంటపడింది వాస్తవమేనని అన్నారు. సమాచారం అందిన వెంటనే ఓ బృందాన్ని పంపించామన్నారు. చీకటి పడిన నేపథ్యంలో బుధవారం చిరుత తిరిగిన ఆనవాళ్లను సేకరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment