నాసిరకం బియ్యం సరఫరాపై ఆగ్రహం
డొంకేశ్వర్(ఆర్మూర్): పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా చేయడంపై జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అసహనం వ్యక్తం చేశారు. డొంకేశ్వర్ మండలంలో మంగళవారం పర్యటించిన కలెక్టర్ నూత్పల్లి బీసీ బాలుర గురుకులం, తొండాకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీసీ గురుకులంలో బియ్యం నాసిరకంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. నాణ్యత లేని బియ్యం కారణంగా అన్నం సరిగా ఉడకడం లేదని, బియ్యం బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు కనీసం ట్యాగ్లు కూడా లేవన్నారు. వెంటనే నాణ్యమైన సన్నబియ్యం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్టోర్ రూమ్‌లో నిలువ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. తరగతి గదులను సందర్శించి విద్యా బోధన తీరును గమనించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున సిలబస్ పూర్తి చేసి పున:శ్చరణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అనంతరం తొండాకూర్ జెడ్పీహెచ్‌ఎస్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆయనవెంట తహసీల్దార్ ఆనంద్, ఎంపీవో లక్ష్మీప్రసాద్, ఆర్ఐలు కిరణ్, అశోక్ ఉన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
అందించాలన్న కలెక్టర్ హనుమంతు
¯]l*™Œæ-ç³-ÍÏ ½ïÜ VýS$Æý‡$MýS$ÌS…, ™ö…yé-MýS*ÆŠæḥ
జెడ్పీహెచ్ఎస్ ఆకస్మిక తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment