డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఆరుగురికి జైలు
ఖలీల్‌వాడి : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఆరుగురు వాహనదారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 22 మంది పట్టుబడ్డారని పేర్కొన్నారు. ఆయా పోలీస్‌స్టేషన్‌లలో కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం స్పెషల్ జ్యుడిషియల్ రెండో క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా ఇద్దరికి ఒక రోజు చొప్పున, ముగ్గురికి రెండు రోజులు, మరొకరికి మూడురోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారని తెలిపారు.
29 వాహనాలు సీజ్
మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నగరంలోని ఒకటో, మూడో, నాలుగో, ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వాహనాలు తనిఖీ చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. సరైన పత్రాలు, నంబర్‌ప్లేట్లు లేని 29 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆయన సూచించారు.
అపార్ నమోదు
చేయించుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా అపార్ నమోదు చేయించుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. అపార్ నమోదు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీధర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మంగళవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు.
రవికుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాల స్థాయిలో హెడ్ మాస్టర్‌లు, ప్రిన్సిపాల్‌లు వెంటనే విద్యార్థుల వివరాలతో యుడైస్ ద్వారా వన్ నేషన్ వన్ స్టూడెంట్ 12 డిజిట్ గుర్తింపు నంబర్ తీసు కోవాలని అన్నారు. ప్రతి విద్యార్థికి తన కెరీర్ అభివృద్ధి, ఉద్యోగం పొందేందుకు అపార్ అవసరమని అన్నారు. డీఈవో అశోక్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవన్, జిల్లా ప్రభుత్వ కళాశాలల సీనియర్ ప్రిన్సిపాల్ రజీయొద్దీన్ అస్లాం, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment