
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గొట్టం చంద్రపాల్‌రెడ్డి(26) అమెరికాలో మృతిచెందారు. ఈనెల 23న అమెరికాలోని టెక్సాస్‌లో గుండెపోటుతో మృతిచెందగా ఆయన తల్లిదండ్రులకు తాజాగా సమాచారం అందింది. దీంతో చంద్రపాల్‌రెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి–శోభ తమ కుమారుడి మృతదేహాన్ని కడచూపు కోసం స్వస్థలానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు విన్నవించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.