లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో భారీ షెడ్డును ఏర్పాటు చేస్తున్న దృశ్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయకుడి గుడి వద్ద నుంచి ప్రారంభమైన క్యూలైన్ల ఏర్పాటు దాదాపు పూర్తయింది. కనకదుర్గనగర్లో ప్రసాదం కౌంటర్ల కోసం క్యూలైన్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి ప్రాంగణంలో షెడ్డు నిర్మాణం, మహా మండపం దిగువన హోమ గుండాల పనులు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో హోమగుండాల నిర్మాణం పూర్తవుతుందని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. సీతమ్మ వారి పాదాల వద్ద భవానీలు తలనీలాలు సమర్పించడానికి కేశ ఖండనశాల షెడ్డు, స్నాన ఘాట్లలో జల్లు స్నానాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీక్ష విరమణలపై ఆలయ ఈవో కె.ఎస్.రామారావు ఇంజినీ రింగ్ అధికారులతో సమీక్షిస్తున్నారు. దేవస్థాన చైర్మన్ కర్నాటి రాంబాబు పనులు నెలాఖరుకు పూర్తి కావాలని సూచిస్తున్నారు. వీరితోపాటు కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ టీకే రాణా ప్రత్యేక దృష్టి పెట్టారు.
దీక్ష విరమణ ఏర్పాట్లు తుది దశకు క్యూలైన్ పనులు
Comments
Please login to add a commentAdd a comment