ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈవో ఎన్.రమేష్‌బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.
వంగవీటి రంగాకు నివాళి
పెడన: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారం వంగవీటి మోహనరంగా వర్ధంతిని నిర్వహించారు. రంగా విగ్రహాల వద్ద, చిత్రపటాలకు నేతలు పూలమాలలు వేశారు. పెడనలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, నేతలు రంగా చిత్రపటం వద్ద నివాళులర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన రంగా చిరస్మరణీయుడని పలువురు నేతలు కొనియాడారు. రాజకీయ నేతగా, కార్మిక నాయకుడిగా, పేదల మోములో వెలుగు నింపారని తెలిపారు.
డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ వాలీబాల్ జట్టు ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వాలీబాల్ మహిళల జట్టుకు కె.జయలక్ష్మీసాయిఅనీల(జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ, రాజమండ్రి), ఆర్.సాయిసుష్మ(జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ, రాజమండ్రి), ఎస్.సాయిశ్రీనిజ(జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ, రాజమండ్రి), కె.కృష్ణప్రియ(ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, చినకాకాని), ఎన్.తిరుమల(సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజీ, ఏలూరు), కె.సుష్మ వెంకటసత్యలత(సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజీ, ఏలూరు), ఎల్.హర్షప్రియ(సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజీ, ఏలూరు), కె.రమ్యశ్రీ(సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజీ, ఏలూరు), ఎ.లతశ్రీకృష్ణభార్గవి(మహారాజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సైన్సెస్, విజయనగరం), ఎస్.నేహా(మహారాజా కాలేజీ ఆఫ్ నర్సింగ్, విజయనగరం), డి.వర్ష(సిద్ధార్థ మెడికల్ కాలేజీ, విజయవాడ), కె.నందిని(కాటూరి మెడికల్ కాలేజీ, చిన్నకొండ్రుపాడు) ఎంపికై నట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ త్రిమూర్తి తెలిపారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయ పోటీలకు జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఎంపికై న క్రీడాకారులను వీసీ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధిక మంగళవారం అభినందించారు.
ఆర్టీఈఏ ఆవిర్భావ సభ
విజయవాడ కల్చరల్: ఏపీ గురుకుల రెసిడెన్షియల్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(ఆర్టీఈఏ) ఆవిర్భావ సభ గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అసోసియేషన్ చిత్తశుద్ధితో పని చేయాలని అండగా ఉంటామని తెలిపారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శాంతికుమార్ మాట్లాడుతూ సంస్థ న్యాయపరమైన సమస్యలకు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీఈఎ అధ్యక్షుడు సూర్యతేజ, సెక్రటరీ చంగయ్య, వైస్ ప్రెసిడెంట్ మన్వర్, కోశాధికారి హుస్సేన్ జోన్ కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment