జనసేన పార్టీ నాయకుడు చలమలశెట్టి రమేష్ బాబు
రామవరప్పాడు: టీడీపీ నాయకుడు రెచ్చగొట్టడం వల్లే ఎనికేపాడు విగ్రహాల ఆవిష్కరణలో గొడవ జరిగిందని గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు పేర్కొన్నారు. ఎనికేపాడు శివాలయం పల్లాల్లో మంగళవారం వంగవీటి మోహన రంగా, మహత్మాగాంధీ విగ్రహాల ఆవిష్కరణలో గొడవ జరిగిన నేపథ్యంలో గ్రామంలోని ఓ హోటల్లో రమేష్‌బాబు బుధవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కోనేరు పెదబాబు కుమారుడు కోనేరు సందీప్ తనకు ఫోన్ చేసి ‘మా ఊరిలో విగ్రహాలు ఆవిష్కరించడానికి మీరెవరు? మేము మీ ఊరు వచ్చి పెత్తనం చేస్తే మీకు ఎలా ఉంటుంది’ అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని పేర్కొన్నారు. విగ్రహాల ఏర్పాటుకు పంచా యతీ నుంచి అనుమతులు ఉన్నాయని, స్థానిక ఎమ్మెల్యే, పోలీసులకు కూడా తెలిపామని బదులిచ్చి విగ్రహాలను ఆవిష్కరించామన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలు సృష్టించాలనే దురుద్దే శంతో పంచాయతీ కార్యదర్శి విద్యాధర్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను సందీప్ తమపైకి ఉసిగొల్పాడన్నారు. రాద్ధాంతం చేయాలనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే విగ్రహం అంశాన్ని తెరపైకి తెచ్చా రని ఆరోపించారు. గాంధీ విగ్రహం ఏర్పాటును ఆపా లని తొలుత పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ తమపై దౌర్జనం చేశాడని, కార్యదర్శి అని తెలియక తాము కూడా అదే రీతిలో సమాధానం చెప్పి కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. జనసేన కార్యకర్తల మధ్య సమస్యలు సృష్టించడానికి కోనేరు సందీప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల రామవరప్పాడులో జనసేన పార్టీ జెండా దిమ్మెను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని గుర్తుచేశారు. పంచాయతీ కార్యదర్శి విద్యాధర్‌పై పంచాయతీ రాజ్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీ, ఎమ్మెల్యే, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు టంకసాల సుబ్బారావు, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment