సురక్షిత ప్రయాణానికి చిరునామాగా ఆర్టీసీని చెబుతుంటారు.
విజయవాడస్పోర్ట్స్: రోడ్లపై తిరిగే డొక్కు బస్సులతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొండపల్లి నుంచి పామర్రు వరకు, పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు ప్రతి రోజూ తిరిగే కాలం చెల్లిన సిటీబస్సులు ప్రజారోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటినుంచి వచ్చే నల్లటి పొగ రోడ్లను కప్పేస్తూ.. గాలిలోకి ప్రమాదకర రసాయనాలు విడుదలవుతున్నాయి. గవర్నర్‌పేట–1,2, విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం డిపోల నుంచి 378 సిటీ బస్‌లు విజయవాడతో పాటు నగర శివారు ప్రాంతాలు, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిల్లో గవర్నర్‌పేట–2 డిపోలో కొన్ని సీఎన్‌జీలు ఉండగా, మిగిలిన డిపోల్లో అత్యధిక శాతం ఉన్న డీజిల్ బస్‌లు కొన్ని నెలలుగా ప్రజలపై విషం చిమ్ముతున్నాయి.
నిర్వహణ లోపమే..
నిర్వహణ లోపం కారణంగానే డీజిల్ బస్సులు లక్షలాది మంది ప్రజల ముఖాలపై పొగలు కక్కుతున్నాయి. ప్రధానంగా ఇంజన్‌లోని ఫ్యూయల్ స్ప్రే ఇంజెక్టర్లకు సరైన మరమ్మతులు జరగక పొగ వస్తోందని గ్యారేజీల్లోని మెకానిక్‌లే చెబుతున్నారు. అయితే మరమ్మతులకు గురైన స్ప్రే ఇంజెక్టర్లు.. డీజిల్‌ను పిస్టన్‌ల పైకి స్ప్రే చేయలేవు. దీంతో డీజిల్ పిస్టన్ పైకి చుక్కచుక్కలుగా పడుతుందని, ఆ విధంగా పడిన చుక్క బర్న్ కాకుండా నేరుగా సైలెన్సర్‌లోకి చేరి, అక్కడ నుంచి నల్లటి పొగ రూపంలో బయటకు వచ్చేస్తుందని వెల్లడిస్తున్నారు. నిర్ణీత కిలోమీటర్లకు ఎయిర్ ఫిల్టర్లు క్లీన్ చేయకపోవడం/ మార్చకపోవడం, ఫ్యూయల్ నాణ్యత తదితర కారణాలు సైతం బస్సుల ఫిట్‌నెస్‌ను తగ్గించి పర్యావరణానికి పెనుసవాల్‌గా మారుతున్నాయి.
డ్రైవర్లపై నెపం నెట్టేస్తూ
సకాలంలో, సక్రమంగా ఇంజన్ మరమ్మతులు చేయించడంలో విఫలమవుతున్న అధికారులు.. బస్‌ల నుంచి వచ్చే నల్లటి పొగ నెపాన్ని డ్రైవర్లపై నెట్టేస్తున్నారు. గతంలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్‌లు నుంచి ఇంద్ర, గరుడ వంటి బస్‌ల వరకు నడిపిన డ్రైవర్‌లే బదిలీల్లో భాగంగా సిటీ డిపోలకు వస్తుంటారు. ఎక్స్‌ప్రెస్, గరుడ బస్సులు నడిపినపుడు రాని పొగ, సిటీ బస్ నడిపేపుడు ఎందుకు వస్తుందని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. బస్‌ల నిర్వహణ లోపం వెనుక డిపో అధికారుల చేతివాటం దాగి ఉందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కాలం చెల్లిన బస్సులతోనే నెట్టుకొస్తున్నారు..
సిటీ సర్వీస్‌లలో కొత్త బస్‌లు ఉండవు. దూర ప్రాంతాలకు తిరగడానికి పనికి రాని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు వంటి బస్సులను ప్రస్తుతం సిటీ సర్వీసులకు వాడుతున్నారు. బస్సు ఫిట్‌నెస్ ప్రకారం 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన వాహనాలను సైతం ప్రస్తుతం సిటీలో తిప్పుతున్నారు. ఇవి ప్రజల పాలిట శాపంగా మారాయి.
ప్రజారోగ్యంపై దుష్ప్రభావం నిర్వహణ లోపంతో విషం చిమ్ముతున్న సిటీ బస్‌లు దారి పొడువునా నల్లని పొగ పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment