రూ.64 లక్షలు చోరీ సొత్తు రికవరీ | - | Sakshi
Sakshi News home page

రూ.64 లక్షలు చోరీ సొత్తు రికవరీ

Published Fri, Jan 31 2025 2:00 AM | Last Updated on Fri, Jan 31 2025 2:00 AM

రూ.64 లక్షలు చోరీ సొత్తు రికవరీ

రూ.64 లక్షలు చోరీ సొత్తు రికవరీ

ముగ్గురు నిందితుల అరెస్టు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలులో బంగారం వ్యాపారి నుంచి రూ. 64 లక్షలు చోరీ చేసిన కేసులో విజయవాడ గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం జీఆర్‌పీ డీఎస్పీ రత్నరాజు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన మనోజ్‌కుమార్‌ జైన్‌ అక్కడే ఒక నగల షాపులో పని చేస్తుంటాడు. తన యజమాని చెప్పినట్లుగా బంగారం కొనుగోలు నిమిత్తం తరచూ చైన్నె వెళ్లొస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 24 రాత్రి తన యజమాని ఇచ్చిన నగదు ఉన్న ట్రాలీ బ్యాగును తీసుకుని చైన్నెలో బంగారం కొనుగోలు చేసేందుకు భువనేశ్వర్‌–రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి, బి–2 కోచ్‌లో తన సీటు కింద బ్యాగు ఉంచి నిద్రపోయాడు. రైలు విజయవాడ వచ్చిన తరువాత చూసుకుంటే బ్యాగు కనిపించలేదు. రైలులో అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై వెంటనే విజయవాడ జీఆర్‌పీకి ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఆదేశాల మేరకు రైల్వే డీఎస్పీ రత్నరాజు సమక్షంలో సీఐ జె.వి.రమణ, ఆర్‌పీఎఫ్‌ సీఐ ఫతే ఆలీ బేగ్‌లతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో చోరీకి పాల్పడిన రాజమండ్రికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

నిఘా పెట్టి చోరీ చేశారు

రాజమండ్రికి చెందిన ఆకుల సాయికృష్ణ గతంలో రాజమండ్రిలో నగల షాపులో పనిచేసి మానేశాడు. చెడు వ్యవసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన స్నేహితులైన పెండం ప్రసన్న కుమార్‌, ఉల్లూరి మహేష్‌ కుమార్‌లతో కలసి చోరీలకు ప్రణాళిక వేసుకున్నాడు. నగల వ్యాపారులు తరచూ బంగారం కొనుగోలు కోసం నగదుతో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారనే విషయం తెలిసిన సాయికృష్ణ అటువంటి సందర్భం కోసం ఎదురు చూడసాగాడు. ఈ క్రమంలోనే మనోజ్‌కుమార్‌ జైన్‌ నగదుతో చైన్నె వెళ్తున్న విషయం గుర్తించి స్నేహితులతో కలసి అదే రైలులో ఆయన్ను అనుసరించారు. రైలు విజయవాడ సమీపంలో ఉండగా వ్యాపారి నిద్రలోకి జారుకోగానే నగదు ఉన్న ట్రాలీ బ్యాగు తీసుకుని పరారయ్యారు. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారు. గురువారం వారు విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో అనుమానాస్పదంగా ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగును సోదా చేయగా ఒక బ్యాగులో రూ. 60 లక్షలు, మరో రెండు బ్యాగుల్లో రెండేసి లక్షల చొప్పున మొత్త రూ. 64 లక్షలు లభించాయి. విచారణలో నగల వ్యాపారి నుంచి చోరీ చేసిన నగదుగా తేలడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement