కూలీలపై పెత్తనం చేస్తే కుదరదు | - | Sakshi
Sakshi News home page

కూలీలపై పెత్తనం చేస్తే కుదరదు

Published Fri, Jan 31 2025 2:00 AM | Last Updated on Fri, Jan 31 2025 2:00 AM

కూలీలపై పెత్తనం చేస్తే కుదరదు

కూలీలపై పెత్తనం చేస్తే కుదరదు

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

జి.కొండూరు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మేట్‌లు (గ్రూపు లీడర్లు) కూలీలపై పెత్తనం చేసేందుకు కాదని, ప్రతి ఒక్కరూ పనుల్లో పాల్గొనాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్‌ గురువారం జి.కొండూరు మండల పరిధి చెవుటూరులో పర్యటించారు. గ్రామంలో సిమెంట్‌ రోడ్లు, గోకులం షెడ్లు, వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ యూనిట్‌తో పాటు ఉపాధి హామీ పథకంలో మంజూరైన నిమ్మతోటను పరిశీలించారు. గ్రామ శివారులోని అమృత్‌ సరోవర్‌ చెరువులో జరుగుతున్న పనులను పరిశీలంచి ఉపాధి కూలీలతో కలెక్టర్‌ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు కూలీలకు ప్రతిరోజూ పని పరిధిని కేటాయిస్తే ఎక్కువ పని చేయడంతో పాటు అధిక వేతనం పొందే అవకాశం ఉంటుందని సూచించారు. అన్ని గ్రామాల్లో దినసరి వేతనం రూ.295 తక్కువ కాకుండా వచ్చేలా చూడాలని కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై మొగ్గుచూపేలా, భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని అరికట్టడానికి రైతులకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరిధిలో సీసీ రోడ్ల నాణ్యతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎ.రాము, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి రమేష్‌, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement