బాపూజీ మార్గం అనుసరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించిన మహనీయుడు, జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం అనుసరణీయమని కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతి సమగ్రత, ఐక్యతకు బాపూజీ పోరాడారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment