విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Sun, Mar 2 2025 1:14 AM | Last Updated on Sun, Mar 2 2025 1:14 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025

–8లోu

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కోటా బియ్యాన్ని తెలుగు తమ్ముళ్లు బొక్కేస్తున్నారు. వాటాలు వేసుకుని మరీ అక్రమ దందా సాగిస్తున్నారు. నియోజకవర్గానికి ఓ ముఠాగా ఏర్పడి రేషన్‌ బియ్యం మాఫియాను నడుపుతున్నారు. ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నెలవారీ మూమూళ్లు తీసుకుని రేషన్‌ మాఫియాకు పచ్చ జెండా ఊపుతున్నారు. ఫలితంగా రేషన్‌ బియ్యం పక్కదారిపడుతోంది. బియ్యం పంపిణీచేసే వాహనాల వద్దే డబ్బు కావాలా.. బియ్యం కావాలా అంటూ రైస్‌కార్డు లబ్ధిదారులను మాఫియా నిర్వాహకులు అడుగుతున్నారు. డబ్బు కావాలనే వారికి కిలోకు రూ.10 చొప్పున ఇచ్చి బియ్యం సేకరిస్తున్నారు. వారు కొంత లాభం తీసుకుని, నియోజకవర్గం మొత్తానికి బియ్యం మాఫియాగా వ్యవహరిస్తున్న వారికి విక్రయిస్తున్నారు. ఇందుకు ఒప్పందాలు సైతం కుదుర్చుకుంటున్నారు.

చౌకబియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రేషన్‌ పంపిణీ సమయంలో వలంటీర్‌తోపాటు ఆర్‌ఐ సిబ్బంది ఉండి బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థకు తూట్లు పొడిచి రేషన్‌ మాఫియాకు అండగా నిలుస్తోంది. బియ్యం, ఇతర సరుకుల పంపిణీ సక్రమంగా జరిగిందా? లేదా? అని పరిశీలించటంతోపాటు బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాల్సిన పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్‌, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా మామూళ్ల మత్తులో జోగుతూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో రేషన్‌ మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. విజయవాడ నగరంలో 2,65,928 బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 2,39,335 మంది (90 శాతం)లబ్ధిదారులు రేషన్‌ బియ్యం తీసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో దాదాపు 60 నుంచి 70 శాతానికి పైగా బియ్యం పక్కదారి పడుతోందని సమాచారం.

విజయవాడ సెంట్రల్‌ ప్రజాప్రతినిధికి నెలకు రూ.7 లక్షలు

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో రేషన్‌ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. ఈ నియోజకవర్గంలో గతంలో 63వ డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి రేషన్‌ మాఫియా నడిపేవాడు. అయితే ఆ వ్యక్తిని కాదని 59వ డివిజన్‌కు చెందిన వ్యక్తికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి రేషన్‌ బియ్యం దందాను అప్పజెప్పారు. ఆ వ్యక్తి నెలకు రూ.7 లక్షల చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాదు రెండు నెలల అడ్వాన్స్‌గా రూ.14 లక్షలు జేబులో వేసుకున్నారు. గతంలో దందానడిపిన వ్యక్తికి, ఇప్పుడు దందా దక్కించుకున్న వ్యక్తి ఇద్దరూ టీడీపీకి చెందిన వారే. వారిద్దరి మధ్య ఇప్పుడు అంతర్గత పోరు నడుస్తోంది. తాజాగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి సూచించిన వ్యక్తికి మద్దతుగా నియోజకవర్గంలోని డీలర్ల నుంచి బియ్యం సేకరించేందుకు ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగారు. 63 డివిజన్‌ చెందిన, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లలో అవినీతి పాల్పడిన వ్యక్తి, ప్రజాప్రతినిధికి రైట్‌ లెఫ్ట్‌గా ‘కొండ’ల ఉండే మరో వ్యక్తి, రేషన్‌ డీలర్ల రాష్ట్ర సంఘం నేత ముగ్గురు లాబీయింగ్‌ చేస్తున్నారు. వారికి రేషన్‌ మాఫియా నడిపే వ్యక్తి పది శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. మొత్తం మీద పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని వదలకుండా వాటాలు పంచుకుని దండుకోవటం నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతోపాటు, గొల్లపూడి, వైఎస్సార్‌ కాలనీ, జూపూడి పంచాయతీ పరిధిలో రేషన్‌ బియ్యాన్ని గొల్లపూడికి చెందిన ఓ టీడీపీ నేత సేకరించి, అక్రమ రవాణా చేస్తున్నారు.

● నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు, నందిగామ మండలాలకు చెందిన రేషన్‌ బియ్యాన్ని చందర్లపాడు గ్రామానికి టీడీపీ నేతకు అప్పజెప్పారు. వీరులపాడు, కంచిర్ల మండలాల రేషన్‌ మాఫియాను వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నడుపుతున్నారు. ఇద్దరు మాఫియా నిర్వాహకుల నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెలకు రూ.3 లక్షల చొప్పున రూ.6 లక్షల వాటా అందుతోందని సమాచారం.

● జగ్గయ్యపేట పట్టణంలోని ఓ కార్పొరేటర్‌, వత్సవాయి మండలం లింగాల గ్రామానికి చెందిన ప్రముఖ రేషన్‌ మాఫియా నిర్వాహకుడు జగ్గయ్యపేట నియోజకవర్గం మొత్తానికి రేషన్‌ బియ్యం దందా సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెలనెలా రూ.5 లక్షలకు పైగా ముట్టజెబుతున్నారు.

● మైలవరం నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరుడిగా చెలామణీ అవుతున్న వ్యక్తి విస్సన్నపేటలో నివసిస్తూ రేషన్‌ మాఫియా నడిపిస్తున్నారు. ప్రజాప్రతినిధి బావమరిదికి ఇతను పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తున్నట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి.

● తిరువూరు నియోజకవర్గంలో విచ్చల విడిగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. దీని వెనుక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నట్లు నియోజకవర్గంలో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉర్దూ పాఠశాలల టైమింగ్‌ మార్చండి

ఇబ్రహీంపట్నం: రంజాన్‌ మాసంలో ఉర్దూ పాఠశాలల పనివేళలు మార్చాలని ఏఐఐటీఏ, ఉర్దూ జేఏసీ ఆధ్వర్యాన పాఠశాల విద్యా కమిషనర్‌ విజయరామరాజుకు శనివారం వినతిపత్రం అందజేశారు. రంజాన్‌ మాసంలో ముస్లిం ఉపాధ్యాయులు ఉపవాసం ఉండటానికి ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల వేళలు మార్చాలన్నారు. పాఠశాల పునర్నిర్మాణంలో భాగంగా ఉర్దూ పాఠశాలలకు ఆంగ్ల మాధ్యం నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉర్దూ కాంప్లెక్స్‌లను యథావిధిగా కొనసాగించాలని కోరారు. మైనార్టీ విద్యార్థులు ఉన్న స్కూల్స్‌లో ఉర్దూ ఎస్జీటీని ఏర్పాటు చేయడం, జెడ్పీ పాఠశాలల్లో ప్రథమ భాషగా ఉర్దూ బోధించడానికి ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉర్దూ జేఏసీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ ఇర్ఫాన్‌, ఆల్‌ ఇండియా ఐడియల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. తొలుత స్వామివారికి చూర్ణోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన చేసి నూతన వస్త్రాలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ రథోత్సవం పూర్తయిన చూర్ణోత్సవం, వసంతోత్సవం ఆనవాయితీగా వస్తుందన్నారు. పూర్ణాహుతితో పంచాహ్నిక దీక్షతో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముగిశాయన్నారు.

ఇఫ్తార్‌ సహరి

(ఆది) (సోమ)

విజయవాడ 6.19 5.07

మచిలీపట్నం 6.19 5.05

7

పక్కదారిపడుతున్న చౌక బియ్యం కోటా బియ్యన్ని బొక్కేస్తున్న తమ్ముళ్లు టీడీపీ నేతల కనుసన్నల్లోనే రేషన్‌ దందా అక్రమాలను పట్టించుకోని అధికారులు

న్యూస్‌రీల్‌

కొయ్యూరులో

పట్టివేత

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: బాపులపాడు మండలం కొయ్యూరులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని పీడీఎస్‌ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మల్లవల్లి రాంబాబు, అతని తనయుడు శ్యామ్‌ కొంతకాలంగా పరిసర గ్రామాల కార్డుదారుల నుంచి రేషన్‌ బియ్యం సేకరించి, అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం అందుకున్న పీడీఎస్‌ డెప్యూటీ తహసీల్దార్‌ ప్రధాన్‌, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుబ్రహ్మాణ్యం శనివారం తనిఖీలు నిర్వహించారు. దాడిలో 32 బస్తాల రేషన్‌బియ్యాన్ని అధికారులు గుర్తించారు. అక్రమ వ్యాపారం చేస్తున్న మల్లవల్లి రాంబాబుపై 6ఏ, 7సీ కేసులను నమోదు చేసినట్లు పీడీఎస్‌ డీటీ ప్రధాన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/10

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/10

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement