
మచిలీపట్నం కళాకారులకు అవకాశమిస్తా
సినీరచయిత బెజవాడ ప్రసన్నకుమార్
మచిలీపట్నం టౌన్: రానున్న రోజుల్లో బందరు కళాకారులకు అవకాశమిస్తానని సినీరచయిత బెజవాడ ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రసన్నకుమార్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే చేసిన చిత్రం మజాకా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఆదివారం స్వగ్రామమైన మచిలీపట్నంలో ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. త్వరలో పెద్ద హీరోలతో సినిమా ప్రారభించబోతున్నానని ప్రసన్నకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి రోజు మజాకా సినిమా రిలీజ్ అయిందని, సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేసి అదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా రిలీజ్ అనంతరం తిరుపతిలో స్వామి వారిని దర్శించి మచిలీపట్నంలో స్నేహితులతో కలిసి సినిమా చూడటం ఆనందాన్ని కలిగించిందన్నారు. కొద్దిరోజుల్లోనే మాస్ మహరాజా రవితేజతో సినిమా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌ను పలువురు కళాకారులు, మీడియా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment