
ఉలిక్కిపడిన జగ్గయ్యపేట!
● వరుస కత్తిపోట్లు, దాడులు ● పేటవాసుల్లో భయాందోళన ● పోలీసు చర్యలేవి..
జగ్గయ్యపేట అర్బన్: ప్రాచీన పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతున్న జగ్గయ్యపేట ఉలిక్కిపడుతోంది. దీనికి కారణం ఈ ప్రాంతంలో వరుస హత్యలు జరగడం.. మాదకద్రవ్యాల నిషాలో యువత మునిగిపోవడమే. ఈ క్రమంలోనే రెండు నెలల వ్యవధిలోనే సుమారు ఆరుగురు కత్తిపోట్లకు గురవ్వగా వారిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, ముగ్గురు కత్తిపోట్ల గాయాలతో చికిత్స పొందుతున్నారు. గత ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి ఎల్లమ్మతల్లి జాతరలో డీజే వద్ద ఏర్పడిన స్వల్ప ఘర్షణ చివరికి కత్తులతో దాడికి దారి తీసింది. శాంతినగర్‌లోని దుర్గాదేవి, కాళిమాత ఆలయాల పూజారిగా పనిచేస్తున్న చెరువుబజారుకు చెందిన బత్తుల శ్రీనును ప్రత్యర్థి యువకులు మద్యం, గంజాయి మత్తులో కోడి కత్తితో గొంతు కోశారు. గత నెల 28వ తేదీన ఉదయం సత్యనారాయణపురంలో మరొక కత్తిపోట్ల సంఘటన జరిగింది. అదే రోజు సాయినగర్‌లో ఓ భార్యపై భర్తపై కొబ్బరిబొండాల కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
పోలీసుల వైఫల్యం అంటున్న ప్రజలు
ఇటీవల పట్టణంలో తరచూ నేరాలు, ఘోరాలు, హత్యలు, దాడులు జరుగుతున్నా వాటిని నివారించడంలో పట్టణ పోలీసులు విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గంజాయి వంటి మత్తుపదార్థాలకు యువత బానిసలుగా మారి ఇలా జరుగుతున్నాయా...లేక క్రైమ్‌ను పోలీసులు కంట్రోల్ చేయలేక హత్యలు, దాడులు జరుగుతున్నాయా అనే విమర్శలు వస్తున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయాలు, అమ్మకాలు పట్టణంలో జరగకుండా చూడటంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలు యథేచ్ఛగా జరుగుతుండటంతో ఇటీవల విష్ణుప్రియనగర్‌లో ఇళ్ల వద్ద ఏర్పాచేసిన సీసీ కెమెరాలను కూడ దొంగలు ఎత్తుకుపోయారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment