న్యాయమూర్తుల నివాస భవనాలు ప్రారంభం
గుడివాడ టౌన్: స్థానిక పోస్టాఫీస్ రోడ్‌లోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన న్యాయమూర్తుల నివాస భవనాలను కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్పెషల్ జడ్జి అరుణ సారిక ఆదివారం ప్రారంభించారు. న్యాయమూర్తులకు అధునాతన సౌకర్యాలతో నివాసాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వీటిని నిర్మించామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి జి. సుబ్రహ్మణ్యం, సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి హరినాథ్, సెక్రటరీ ఎం. నటరాజ్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పవళింపు సేవ
పెదకల్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో వేంచేసియున్న శ్రీ దుర్గా, పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శంకర మంచి భాస్కర విజయకుమార్, బుద్ధు నాగవరప్రసాద్ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు చేసిన అనంతరం భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బద్ధంగా స్వామివారి పుష్పశయ్యాలంకృత పవళింపు సేవను వేదపండితులు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
‘ఏపీ హంస’
క్రీడా పోటీలు ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీ హంస) ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలలో పనిచేసే మహిళా ఉద్యోగులకు వైద్య కళాశాల ప్రాంగణంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు భాగస్వాములవుతున్నారు. వారికి టగ్ ఆఫ్ వార్, షాట్ పుట్, లెమన్ స్పూన్, స్పీడ్ వాకింగ్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, హ్యాండ్ బాల్ వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను ఉమ్మడి కృష్ణాజిల్లా ఏపీ హంస అధ్యక్షుడు వినుకొల్లు రామకృష్ణ పర్యవేక్షిస్తుండగా, కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా సహాధ్యక్షుడు సత్యనారాయణ బాబు, జాయింట్ సెక్రెటరీ పిచ్చేశ్వరరావు, రాష్ట్ర కమిటీ జాయింట్ జనరల్ సెక్రెటరీ జాన్ హెన్రీ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగానికి నిధులు పెంచాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగానికి బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎండీ రఫీ డిమాండ్ చేశారు. స్థానిక పీడీఎస్‌యూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో 30శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 20శాతం, జీడీపీలో 6శాతం కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు కేటాయించినట్లు గొప్ప లు చెప్పుకుంటుందన్నారు. కానీ విద్యారంగంపై చిన్న చూపు చూస్తోందన్నారు. బడ్జెట్‌లో సంక్షేమ హాస్టళ్లు, విశ్వవిద్యాలయాల ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేసిందన్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదన్నారు. ప్రధాన కార్యదర్శి ఎస్. కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
న్యాయమూర్తుల నివాస భవనాలు ప్రారంభం
న్యాయమూర్తుల నివాస భవనాలు ప్రారంభం
న్యాయమూర్తుల నివాస భవనాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment