రీయింబర్స్ ఓ మిఽథ్య... కార్మికుల వ్యధ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈఎస్‌ఐ చందాదారులకు నగదు రహిత వైద్యంతో పాటు, అత్యవసర సమయంలో పొందిన వైద్యానికి రీయింబర్స్‌మెంట్ పొందే సదుపాయం కూడా ఉంది. కానీ ఇది కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. రీయింబర్స్‌మెంట్ కోసం వచ్చిన ఫైళ్లు డైరెక్టరేట్ కార్యాలయంలో గుట్టలుగా పడి ఉంటున్నట్లు పలువురు కార్మికులు చెబుతున్నారు. ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన బిల్లులను డిస్పెన్సరీల ద్వారా పంపడమే కానీ, రీయింబర్స్‌మెంట్ రావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్‌ఐలో రీయింబర్స్‌మెంట్ పథకం ఫార్సుగా మారిందంటున్నారు.
నిబంధనలు ఇలా...
నగదు రహిత వైద్యం పొందలేని చందాదారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి వైద్యం పొందిన సందర్భంగా, ఆ ఖర్చులు రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశం ఉంది. ఈఎస్‌ఐ ఆస్పత్రి నాలుగు జిల్లాలకు విజయవాడలోనే ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్లు కూడా చికిత్స కోసం ఇక్కడికే రావాల్సి ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈఎస్‌ఐ రిఫరల్ ఆస్పత్రి అయితే, అక్కడి నుంచి లెటర్ తెస్తే నగదు రహిత వైద్యం పొందేందుకు విజయవాడలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి అధికారులు అనుమతి ఇస్తారు. ఈఎస్‌ఐ రిఫరల్ ఆస్పత్రి కాని పక్షంలో డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా అనేక మంది ఈఎస్‌ఐ చందా దారులు నగదు రహిత వైద్యం పొందలేక డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నారు.
నగదు రహిత వైద్యంలోనూ...
ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి నగదు రహిత వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగుల నుంచి కూడా వారు ఎంతోకొంత వసూలు చేస్తున్నారు. ఈఎస్‌ఐ ప్యాకేజీలు తక్కువగా ఉంటాయని, అంతేకాకుండా కొన్ని రకాల చికిత్సలు కవర్ కావంటూ అందిన కాడికి వసూలు చేస్తున్నారు. దీంతో చేసేది లేక, ఆస్పత్రి వాళ్లు అడిగినంత చెల్లిస్తూ వైద్యం పొందుతున్నారు. కనీసం ఈఎస్‌ఐ రిఫరల్ కేసులకు వైద్యం ఎలా అందుతుంది, డబ్బులు ఏమైనా వసూలు చేస్తున్నారా అని పర్యవేక్షించే వారు కూడా లేకపోవడం దురదృష్టకరం.
ఈఎస్‌ఐలో ఏళ్లు గడుస్తున్నా చెల్లింపులు లేని వైనం గుట్టలుగా రీయింబర్స్‌మెంట్ ఫైళ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అప్పుల్లో కూరుకుపోతున్న కార్మికులు
మా వద్ద పెండింగ్ లేవు
ఈఎస్‌ఐ చందాదారులకు రీయింబర్స్‌మెంట్ ఫైల్స్ మా వద్దకు వచ్చినవన్నీ క్లియర్ చేశాము. గతంలో ఫైల్స్ డైరెక్టరేట్‌కు వెళ్లేవి, ఇప్పుడు ఆస్పత్రులకు వస్తున్నాయి. వీలయినంత త్వరగా క్లియర్ చేస్తున్నాం.
– డాక్టర్ వి.జ్యోతి,
సూపరింటెండెంట్, ఈఎస్‌ఐ ఆస్పత్రి
రీయింబర్స్ ఓ మిఽథ్య... కార్మికుల వ్యధ
Comments
Please login to add a commentAdd a comment