గుడివాడరూరల్: పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గుడివాడ తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తటివర్రు గ్రామానికి చెందిన నగుళ్ల రాఘవమ్మ (65) ఆమె కొడుకు సత్యనారాయణ వద్ద పక్క పోర్షన్‌లో నివాసముంటోంది. ఆమెకు 8 సెంట్ల స్థలం ఉంది. దీన్ని ఆమె అమ్ముకునే ప్రయత్నం చేయగా కొడుకు సత్యనారాయణ, కోడలు లక్ష్మి, మనుమడు గంగాధరరావు అడ్డుకుని తీవ్ర మనోవేదనకు గురి చేయడంతో తెల్లవారు జామున 3గంటలకు వృద్ధురాలు పురుగు మందు సేవించింది. తెల్లవారినా లేవకపోవడంతో చుట్టు పక్కల వారు ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి చావుకి కారణమైన కొడుకు, కోడలు, మనుమడుపై కేసు నమోదు చేసి ఎస్‌ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు.
తటివర్రులో ఘటన
Comments
Please login to add a commentAdd a comment