ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు ముగ్గురు రాష్ట్ర క్రీడాకారుల
విజయవాడస్పోర్ట్స్: వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2025కు ప్రాతినిధ్యం వహించే భారత జట్టులో ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు చోటు దక్కించుకున్నారని ఏపీ పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు జి.కోటేశ్వరరావు, వి.రామస్వామి తెలిపారు. ఎఫ్–40 కేటగిరిలో ఆర్.రవి(అనకాపల్లి), టి–11 కేటగిరిలో కె.లలిత(పార్వతిపురం), టి–35 కేటగిరిలో టి.రాము(శ్రీకాకుళం) ప్రపంచ పోటీలకు అర్హత సాధించారని వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2025 పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రపంచ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను ఏపీ క్రీడా ప్రాఽథికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ పి.ఎస్.గిరీష అభినందించారు. టీల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
డీజీపీకి లారీ యజమానుల వినతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు సంబంధిత లారీ ధ్రువపత్రాలన్నీ సక్రమంగా ఉంటే సమీప పోలీసుస్టేషన్ లోనే లారీని విడుదల చేయాలని గతంలో డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని లారీ యజమానులు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు లారీ యజమానుల సంఘం నాయకులు మంగళవారం డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్ (న్యూఢిల్లీ) సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు వైవీ ఈశ్వరరావు, ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, ప్రధాన కార్యదర్శి అల్లాడ వీరవెంకట సత్యనారాయణ తదితరులు డీజీపీని ఆయన కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ కొత్త సర్క్యులర్ జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందికి జరిమానా
విజయవాడలీగల్: నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందికి న్యాయస్థానం జరిమానా విధించింది. నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించిన వాహనచోదకులపై 5వ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంగళవారం ఆరో అదనపు జ్యుడీషియల్ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి లెనిన్ బాబు 8 మందికి ఒక్కొక్కరికి 15వేలు చొప్పున, మిగిలిన 24 మందికి ఒక్కొక్కరికి 10వేలు చొప్పున జరిమానా విధించారు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు ముగ్గురు రాష్ట్ర క్రీడాకారుల
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు ముగ్గురు రాష్ట్ర క్రీడాకారుల
Comments
Please login to add a commentAdd a comment