పాత తరం నాటి సైకిళ్లకు స్వస్తి చెప్పేశారు. ఇప్పుడు ఎక్కవ మంది ఆధునిక మోడల్ సైకిళ్లపై మోజు చూపుతున్నారు. అంతేకాదు తమ ఎత్తుకు అనువుగా ఉండే సైకిల్‌ను ఎంచుకుంటున్నారు. సైకిల్ తొక్కినా ఎలాంటి కీళ్లు, మజిల్స్ నొప్పులు రాకుండా ఉండేందుకు తమ ఎత్తుకు అనువుగా ఉండే సైకిల్స్‌ను ఎంచుకుంటున్నారు. అంతేకాక సైకిల్ స్టోర్స్‌లో సైతం ఎత్తు, బరువుకు తగిన సైకిల్‌ను ఎంపిక చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఏ సైజు సైకిల్ వారికి సరిపోతుందో చూసి విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment