ఆకాశమే హద్దుగా..
మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధిస్తున్నారు. ఆకాశమే హద్దుగా మహిళలు దూసుకుపోతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. చట్ట సభల్లోనూ అత్యధిక సీట్లు మహిళలు విజయం సాధిస్తున్నారు. అనేక నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు ప్రాధాన్యం పెరిగింది. విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలో అనేక మంది మహిళలు కార్పొరేటర్లుగా గెలిచారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు సైతం చిన్న వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం మంచి ఉన్నతిని సాధిస్తుంది. ప్రతి కుటుంబం ఆడపిల్లలకు ఉన్నత చదువులు చదివించేందుకు కృషి చేయాలి.
– రాయన భాగ్యలక్ష్మి, మేయర్, విజయవాడ నగర పాలక సంస్థ
Comments
Please login to add a commentAdd a comment