మగపిల్లలతో సమానంగా చూడాలి..
సమాజం మగపిల్లలతో పాటుగా ఆడపిల్లలను సమానంగా చూడాలి. ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా వివక్ష కొంత కొనసాగుతోంది. మహిళలు విద్యావంతులైనప్పుడే సమాజం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు చదివించటంతో పాటుగా సమాజంలో తిరగటానికి అవకాశం ఇవ్వాలి. తద్వారా కెరీర్‌పై అవగాహన పెరుగుతుంది. అలాగే ప్రేమ, వివాహం మాత్రమే జీవితం కాదు. తమకాళ్లపై తాము నిలబడే దిశగా మహిళలు కృషి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ప్రయత్నించాలి.
– ఆచార్య ఎన్. ఉషా, రిజిస్ట్రార్ కృష్ణా విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment