సమాజానికి నగిషీలుగా మారుతున్న మహిళామణులు
అందం, అభినయం, అణకువ ఒకప్పటి మహిళకు నిర్వచనం.. పరిణతి, పరిపక్వత, పరాక్రమం నేటి మహిళ సొంతం.. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం.. ‘ఇందుగలరు.. అందులేర’ని సందేహం లేకుండా అన్ని రంగాల్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా మలచుకొని.. విభిన్న వేదికలపై ‘వనిత’ర సాధ్యులమని చాటి చెబుతున్నారు. సర్పంచి నుంచి రాష్ట్రపతి వరకూ.. ఉపాధ్యాయ ఉద్యోగాల నుంచి దేశాన్ని రక్షించే త్రివిధ దళాల వరకూ ప్రతి చోట పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు. అన్నింటా తెగువ చూపుతూ సమాజానికి నగిషీలుగా మారుతున్నారు. ‘ఇంతి’ంతై.. విశ్వమంతై అన్నట్లుగా జగతి ప్రగతికి మేము సైతం అంటూ నడుం బిగిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మగువల మనోగతం మీ కోసం..
Comments
Please login to add a commentAdd a comment