
వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఇంద్రకీలాద్రిపై సోమవారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం ఆలయ ప్రాంగణంలో సీతారామ కల్యాణం కనులపండువగా నిర్వహించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై ఆలయ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకాన్ని జరిపించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఆల యానికి తరలించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మంచి ఆహార అలవాట్లు, పరిశుభ్రత, ఆరోగ్య సమ స్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండా లని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, ప్రాధాన్యతపై రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మాతాశిశు సంరక్షణ, సంక్షేమ సేవలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పీడీ నాంచారయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఉషారాణి, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక బదిలీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం ఏపీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అప్లియేట్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా పనిచేస్తున్న జి.గోపీని కృష్ణాజిల్లా జడ్జిగా నియమించారు. మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న చిన్నంశెట్టి రాజును విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎస్.చినబాబును అనంతపురం పోక్సో కోర్టు న్యాయ మూర్తిగా బదిలీ చేసి, ఆ స్థానంలో చిత్తూరు జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తిగా పనిచే స్తున్న బాబూనాయక్‌ను నియమించారు. ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎ.పూర్ణిమను ప్రకాశం జిల్లా ఒంగోలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా నియమించారు. కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న పి పాండురంగారెడ్డిని మచిలీపట్నం పదో అదనపు జిల్లా న్యాయమూర్తిగా నియమించారు.
లంక భూములను
పరిశీలించిన కలెక్టర్, ఎంపీ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇబ్రహీం పట్నం మండలంలోని జూపూడి, చినలంక, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి పరిధిలోని పెదలంక భూములను ఎంపీ కేశినేని శివనాఽథ్ (చిన్ని), ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సోమవారం పరిశీలించారు. మూలపాడు నుంచి కృష్ణానది మీదుగా రాయపూడి గ్రామానికి ఐకాన్ బ్రిడ్జి, రహదారి నిర్మాణం కోసం భూములను సేకరించేందుకు డ్రోన్ సర్వే చేపట్టారు. ఐకాన్ బ్రిడ్జి సమీపంలోనే స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు కూడా లంక భూములు సేకరిస్తారని సమాచారం. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సబ్ కలెక్టర్ కావూరి చైతన్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎంపీ భూములను పరిశీలించి వెళ్లిన తరువాత చైన్నెకు చెందిన బృందం, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరోమారు డ్రోన్‌తో లంక భూములను సర్వే చేశారు. అధికారుల పర్యటనలతో లంక భూముల పట్టాదారులు ఆందోళన చెందు తున్నారు. కనీసం సొసైటీ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా భూముల సర్వే చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం