
ఆస్తుల స్వాహాకే కొత్త సంస్కరణలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో వందల ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాదా రుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. విజయవాడ నగరంతో పాటుగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని అధికారిక నివేదికలు చెబున్నాయి. వాటిలో అత్యధిక శాతం భూములు తెలుగు తమ్ముళ్ల చేతుల్లోనే ఉన్నాయని ముస్లిం సంఘాలు విమర్శిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వక్ఫ్ భూములను కొందరు సాగు పేరుతో లీజుకు తీసుకొని రికార్డులను మార్చేసుకుని అనుభవిస్తున్నారు. మరి కొందరు ఇతర మార్గాల్లో వక్ఫ్ భూములను దక్కించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు కొన్ని చోట్ల వక్ఫ్ భూములకు పట్టాలు ఇవ్వటం వల్ల అవి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ముస్లిం నేతలు చెబుతున్నారు. ఒకటి రెండు కాదు దాదాపుగా వెయ్యి ఎకరాల భూములు ఉమ్మడి జిల్లాలో అన్యాక్రాంతమయ్యాయని వక్ఫ్ బోర్డు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ భూములను ఇప్పటికీ వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోలేకపోతోందని పేర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అత్యంత విలువైన ప్రాంతాల్లో వక్ఫ్ భూములను దర్జాగా ఆక్రమించుకున్నారని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.
విజయవాడ పరిసరాల్లోనూ అన్యాక్రాంతం
వక్ఫ్ బోర్డుకు విజయవాడ, నగర పరిసర ప్రాంతాల్లోనూ అత్యంత విలువైన భూములు ఉన్నాయి. ఈ భూములపై కబ్జాదారుల కళ్లు పడ్డాయి. వక్ఫ్ బోర్డుకు విజయవాడ చుట్టు పక్కల సుమారు 500 ఎకరాల వరకు భూములు ఉన్నాయని అంచనా. ఈ భూముల్లో 200 ఎకరాలు కమర్షియల్ ప్రాంతాల్లో ఉన్నట్లుగా ముస్లిం సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈ 500 ఎకరాల్లో అత్యంత విలువైన ప్రాంతాల్లో 30 నుంచి 40 ఎకరాల వరకు భూములు కబ్జాకు గురయ్యాయయని వివరిస్తున్నారు.
తెలుగు తమ్ముళ్ల ఆక్రమణల్లో వక్ఫ్ భూములు వక్ఫ్‌కు ఉమ్మడి జిల్లాలో 2,600 ఎకరాలు 1000 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని అంచనా భూములను రక్షించాలని కోరుతున్న ముస్లిం సంఘాలు
వక్ఫ్ భూములపై చిత్తశుద్ధి లేదు
వక్ఫ్ భూములపై చంద్రబాబు ప్రభు త్వానికి మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. అందులో భాగంగానే తన ఎంపీలతో పార్ల మెంట్‌లో వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. టీడీపీ పాలనలోనే అత్యధిక భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల రికార్డులు గందరగో ళంగా ఉన్నాయి. వక్ప్ బోర్డు పరిధిలో ఉన్నప్పుడే భూములకు రక్షణ లేదు. ఇక ప్రభుత్వం ఆధీ నంలో ఉంటే ఆక్రమణలకు మరింత సులువవుతుందని ముస్లిం సమాజం భావిస్తోంది.
– షేక్ గౌస్‌మొహిద్దీన్,
మాజీ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్‌బోర్డు
కొత్త చట్టంతో రక్షణ కలిగేనా...?
ఉమ్మడి జిల్లాలో వెయ్యి ఎకరాలు స్వాహా
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వక్ఫ్ బోర్డుకు సుమారు 2,600 ఎకరాల భూములున్నాయని రికార్డులు చెబుతున్నాయి. కృష్ణాజిల్లాలోని 25 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో ఈ భూములు ఉన్నట్లుగా అధికారులు చెబుతు న్నారు. అయితే వెయ్యి ఎకరాల భూములు ఇప్పటికే కబ్జా చెరలో ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా కొండపల్లిలో 50 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 50 ఎకరాలు, గుడూరు మండలంలో వంద ఎకరాలు, గుడివాడ మండలంలో 200 ఎకరాలు, పెనమలూరు మండలం తాడిగడపలో 42 ఎకరాలు, గుడ్లవల్లేరులో 25 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని వివరిస్తు న్నారు. ఈ భూముల్లో అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే దశాబ్దాలుగా ఉన్నా యని ముస్లిం సంఘాలు చెబుతున్నాయి. వాటిని రక్షించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని ముస్లిం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. వాటిని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి. దేశంలో వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్న విలువైన ఆస్తులను కాజేయటానికే ఎన్‌డీఏ ప్రభుత్వం సంస్కరణలంటూ కొత్తగా బిల్లు ప్రవేశపెట్టింది. దేశంలో, రాష్ట్రంలో కోట్ల రూపాయాల విలువైన భూములను కాజేయటానికి కుట్రలు జరుగుతున్నాయి. కొత్తగా అమలులోకి వచ్చిన వక్ఫ్‌బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సమాజం పోరాడుతోంది.
– షేక్ ఆసిఫ్, వైఎస్సార్ సీపీ
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు
గతంలో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సంస్కరణలు తెస్తే, తాజాగా ఎన్‌డీఏ పాలకులు పార్లమెంట్‌లో పెట్టిన సవరణలు ఆమోదం పొందటమే కాకుండా రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా రూపొందాయి. ఇప్పటి వరకూ వక్ప్ బోర్డు పాలకుల పరిధిలో ఉండే ఆస్తుల సంరక్షణ బాధ్యత ఇక ప్రభుత్వ పరిధి లోకి రానుంది. వక్ఫ్‌బోర్డులో ఉండగానే వందలాది ఎకరాల ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయ్యాయి. తాజాగా కేంద్రంలో తెచ్చిన చట్టంతో ఈ ఆస్తుల రక్షణ జరిగే అవకాశం ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఆస్తుల స్వాహాకే కొత్త సంస్కరణలు

ఆస్తుల స్వాహాకే కొత్త సంస్కరణలు

ఆస్తుల స్వాహాకే కొత్త సంస్కరణలు