ఆటలాడుతున్న మహిళలు, విద్యార్థినులు
శ్రీకాకుళం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ సంఘ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల క్రీడా పోటీలు సోమవారం ఉత్సాహంగా ప్రారంభ మయ్యాయి. శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోమ్‌లో జరిగిన ఈ పోటీలను ఎన్జీఓ సంఘ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు ముఖ్య అతిథిగా హాజ రై జెండా ఊపి ప్రారంభించారు. తొలిరోజు లెమన్ స్పూన్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ తదితర క్రీడలను నిర్వహించగా, పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు పాల్గొని ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌద రి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ ఏటా మహి ళా దినోత్సవాలను తమ సంఘ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు, సిబ్బందికి క్రీడాపోటీలు ఆటవిడుపుగా ఉంటాయన్నారు. మహిళా దినోత్సవాల్లో ఉద్యోగినులు పాల్గొనే విధంగా వారికి కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ రెండో పూట అనుమతిచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాసరావు, సంఘ నాయకులు బడగల పూర్ణచంద్రరావు, రాజకుమార్, మాదారపు డేవిడ్, బొత్స శ్రీనివాసరావు, మహిళా విభాగం నేతలు కె.రోజాకుమారి, మమతా బెహరా, పి.శ్రావణి, జి.లలిత, హైమావతి, సబీనా బేగం, నారాయణమ్మ, దేదీప్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment