పీఆర్‌సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి
వినుకొండ(నూజెండ్ల): పీఆర్‌సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి కమిటీ నివేదిక వచ్చేవరకు వెంటనే 35 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్. జోసెఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పీఆర్‌సీ కమిటీ గురించి కనీసం ఊసెత్తడం లేదని, వెంటనే పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల మేరకు కరువు భత్యాయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆగిరిపల్లి ట్రైనింగ్ సెంటర్‌లో ఉండి ప్రధానోపాధ్యాయులు మృతిచెందారని, బాపట్ల శిక్షణ కేంద్రంలోనూ ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారని, నాన్ రెసిడెన్షియల్ విధానంలో ట్రైనింగ్‌లు జరపాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన ప్రధానోపాధ్యాయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జీవో నెం. 117ను రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఒకే పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎల్.వి. రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యు.చంద్రజిత్ యాదవ్, నాయకులు మహబూబ్ సుభాని, వెంకట్‌రెడ్డి, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్. జోసెఫ్ సుధీర్‌బాబు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment