సాక్షి స్పెల్‌బీకి విశేష స్పందన
నగరంపాలెం: విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పెంచేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో గుంటూరు శ్యామలానగర్ ఒకటో వీధిలోని మాంటిస్సోరి స్కూల్‌లో నిర్వహించిన స్పెల్‌బీ పరీక్షకు విశేష స్పందన లభించింది. సాక్షి మ్యాఽథ్స్‌బీ కూడా ఉత్సాహంగా సాగింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి దాదాపు 600 మంది విద్యార్థులు తరలివచ్చారు. వారి వెంట తల్లిదండ్రులు కూడా రావడంతో ప్రాంగణం సందడిగా మారింది. కఠినమైన పదాలకు స్పెల్లింగులు రాసేందుకు పోటీ పడ్డారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను నాలుగు భాగాలుగా విభజించారు. వేర్వేరుగా నిర్వహించిన స్పెల్‌బీ పరీక్ష విద్యార్థుల్లో ఇంగ్లిష్ పదాల ఉచ్ఛారణతోపాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను వెలికితీసేందుకు దోహదం చేసేలా ఉందని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఇంగ్లిష్ వాకాబులరీ, ప్రొనౌన్సేషన్ వంటి అంశాలు పోటీ పరీక్షలు రాసేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయనే భావన వ్యక్తమైంది. ఆలోచనాతత్వాన్ని ప్రేరేపించి, మేధస్సుకు పదనుపెట్టేలా నిపుణులతో రూపొందించిన ప్రశ్నపత్రంతో స్పెల్‌బీ పరీక్ష ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పాఠశాల స్థాయిలో నిర్వహించిన స్పెల్‌బీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి, రీజినల్ స్థాయికి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ స్పాన్సర్‌గా డుకిస్ వాపే, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూలు, రాజమండ్రి వ్యవహరిస్తున్నారు.
ఆసక్తిగా రాశా
అర్జున్‌రెడ్డి, దిల్లీ పబ్లిక్ స్కూల్
సాక్షి స్పెల్‌బీ పరీక్ష ఎంతో ఆసక్తిగా రాశాను. కఠినమైన పదాలకు స్పెల్లింగులు రాయడం బాగుంది. ఈ పరీక్షతో మరింత ఆసక్తి పెరిగింది. గ్రామర్ ప్రాధాన్యం తెలిసింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్పెల్‌బీ పరీక్షకు హాజరయ్యాను. ఇకపైనా ఇలాగే రాస్తాను.
ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా విద్యార్థుల రాక ఆంగ్ల పదాలకు అర్థాలు తెలుసుకునేందుకు ఆసక్తి ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు పెంచేందుకు దోహదం
Comments
Please login to add a commentAdd a comment