నమ్మకద్రోహి సీఎం చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

నమ్మకద్రోహి సీఎం చంద్రబాబు

Published Wed, Jan 29 2025 1:29 AM | Last Updated on Wed, Jan 29 2025 1:28 AM

నమ్మకద్రోహి సీఎం చంద్రబాబు

నమ్మకద్రోహి సీఎం చంద్రబాబు

తక్షణమే రాజీనామా చేయాల్సిందే

ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

సామాజిక ఉద్యమ కార్యకర్త ఈదర గోపీచంద్‌

నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా హామీలు మేనిఫెస్టోలో పొందుపర్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేనని చేతులెత్తేసిన నమ్మకద్రోహి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణం రాజీనామా చేయాలని సామాజిక ఉద్యమ కార్యకర్త, విశ్రాంత పత్రిక సంపాదకులు ఈదర గోపీచంద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌, రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం తక్షణం కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని, రాష్ట్రపతి పాలన విధించి, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని కోరారు. నాడు పిల్లనిచ్చిన మామనే నిర్దయగా, కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిచిన బాబు నేడు తాజాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడిచాడన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేనని, పేదలకు సంక్షేమం ఇవ్వడం కన్నా, పెత్తందారుల రాజధాని అయిన అమరావతిని గ్రాఫిక్స్‌తో నిర్మించడమే తన ప్రధాన లక్ష్యమని ఏమాత్రం జంకు లేకుండా, బరితెగించి ప్రకటించి ఐదు కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. హామీల ఎగవేతనే కాక, రూ.15వేల కోట్ల మేరకు విద్యుత్‌ చార్జీలను పెంచారన్నారు. ప్రజలపై మరిన్ని భారాలు మోపుతానని కూడా ప్రకటించిన బాబును – కూటమిని ఇక ప్రజలు ఏమాత్రం క్షమించరన్నారు. ఇప్పటికై నా తన మనసులోని మాటను బయటపెట్టిన బాబు నైజాన్ని, ప్రజలు గ్రహించి, తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలన్నారు. అందుకు వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు, న్యాయవాదులతో సహా ప్రజాస్వామ్య ప్రియులంతా ఫిర్యాదులు పంపి, చీటింగ్‌, నమ్మకద్రోహం కేసును బాబు ప్రభుత్వంపై పెట్టి అరెస్టు చేయమని కోరాలని గోపీచంద్‌ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement