నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే! | - | Sakshi
Sakshi News home page

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

Published Wed, Jan 29 2025 1:28 AM | Last Updated on Wed, Jan 29 2025 1:28 AM

నిరక్

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

పల్నాడు
బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

ఈవీఎంల గిడ్డంగి తనిఖీ

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎంల గిడ్డంగిని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. భద్రతను పరిశీలించారు.

ఉత్తమ డీఎం అవార్డు

మాచర్ల: మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌ బత్తుల వీరాస్వామి ఉత్తమ అవార్డును కలెక్టర్‌ అరుణ్‌బాబు నుంచి అందుకున్నారు. మంగళవారం వీరాస్వామిని పలువురు అభినందించారు.

బోల్తా కొట్టిన ఆటో

మంగళగిరి (తాడేపల్లి రూరల్‌) : మంగళగిరి జాతీయ రహదారి సర్వీస్‌రోడ్‌లో మంగళవారం ఆటో బోల్తా కొట్టింది. నలుగురికి గాయాలయ్యాయి.

సత్తెనపల్లి: న్యూ ఇండియా లిటర్‌సీ ప్రోగ్రాం (ఎన్‌ఐఎల్‌పీ) కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో వయోజన విద్య, డీఆర్‌డీఏ సంయుక్తంగా ఐదేళ్లపాటు అమలు చేసే ఈ కార్యక్రమానికి సంబంధించి తొలి విడతగా జిల్లాలో 10,707 మంది మహిళలను గుర్తించారు. వీరందరినీ ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా అక్షరాస్యులను చేయాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పం. ఈ మేరకు 1,071 మంది బోధకులకు రెండు విడతల శిక్షణ పూర్తి చేశారు. దీని కోసం ప్రభుత్వం జిల్లాకు రూ. 4.28 లక్షలు విడుదల చేసింది.

సరళమైన బోధన ఇలా...

క్రియాత్మక అక్షరాభ్యాసం: వయోజనులకు అక్షరాలు, పదాలు, వాక్యాలు నేర్పడం, చిన్నపాటి అంకెలపై ప్రాథమిక అవగాహన కలిగేలా శిక్షణ ఇస్తారు.

ఆర్థిక అక్షరాభ్యాసం: ఆర్థిక ప్రణాళికను ప్రారంభించేందుకు పొదుపు అలవాట్లను పెంపొందించడం, చిన్నపాటి గుణకారాలు, కూడికలు, నగదు ఇచ్చిపుచ్చుకునే అంశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై దృశ్య మాధ్యమంలోనూ, ఇరుగుపొరుగు, ఆచార వ్యవహారాలు, ఆరోగ్యం, పిల్లల పెంపకం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.

డిజిటల్‌ అక్షరాస్యత: చాలామందికి డిజిటల్‌ అక్షరాస్యతపై అవగాహన లేదు. వీటిని అధిగమించేందుకు బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు, వ్యాపార, వాణిజ్య, వర్తక సముదాయాల్లో నగదు చెల్లింపుల స్థానే ఫోన్‌ పే, గూగుల్‌ పే తదితర డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన పాఠాలు చెబుతారు.

ఏ ఏ వర్గాల మహిళలకు...

యూ ట్యూబ్‌లోనూ వయోజనులను ఆకట్టుకునేలా సరళమైన భాషలో బోధన సాగిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాయి. 15 సంవత్సరాలు నిండి పాఠశాల విద్యను కోల్పోయిన బాలికలకు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న హెల్పర్స్‌, వంట సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల్లో రాత్రి కాపలాదారు (నైట్‌ వాచ్‌మెన్‌), గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్యులకు ఉల్లాస్‌ అమలు చేస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పడంతోపాటు డిజిటల్‌ లావాదేవీలు అలవాటు చేసేందుకు తలపెట్టిన అండర్‌ స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (ఉల్లాస్‌) కార్యక్రమం అమలుకు అంతా సిద్ధమైంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నది ప్రధాన లక్ష్యం.

క్రీస్తు మార్గంలో సంతోషం

పెదకాకాని: క్రీస్తు మార్గంలో సంతోషం సిద్ధిస్తుందని బైబిల్‌ మిషన్‌ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్‌ రెవరెండ్‌ జె.శామ్యేల్‌ కిరణ్‌ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మహోత్సవాల ప్రాంగణంలో జరుగుతున్న బైబిల్‌ మిషన్‌ మహోత్సవాలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి. మహోత్సవాల కన్వీనర్‌ రెవరెండ్‌ జె.శామ్యేల్‌ కిరణ్‌ వాక్యోపదేశం చేశారు. క్రీస్తు సందేశం అందించారు. బైబిల్‌ మిషన్‌ అధ్యక్షులు, పెదకాకాని స్వస్థిశాల నిర్వాహకులు రెవరెండ్‌ జె శామ్యూల్‌ కిరణ్‌ మహోత్సవాల నిర్వహణ బాధ్యతను చేపట్టి ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో రజిత వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా కృష్ణాజిల్లా సంగీత బృందం భక్తి కీర్తనలు ఆలపించారు. బైబిల్‌ మిషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రెవరెండ్‌ పి.జాన్‌ దేవదాసు, జాయింట్‌ సెక్రటరీ రెవరెండ్‌ జె ఆగమనరావు వాక్యపరిచర్య చేశారు.

ప్రత్యేక బృందాల పర్యవేక్షణ...

7

న్యూస్‌రీల్‌

అక్షర జ్ఞానం, దైనందిన

ఆర్థిక పనులపై అవగాహన

జిల్లాలో తొలి విడతగా 10,707

మంది మహిళలు గుర్తింపు

1,071 మంది బోధకులకు రెండు

విడతల శిక్షణ పూర్తి

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర వయోజన విద్యాశాఖ ఈ కార్యక్రమం అమలు చేస్తోంది0. స్వయం సంఘాల వీవోఏలను వలంటీర్లుగా ఎంపిక చేసి ... వారి ద్వారా గ్రామాల్లో బోధన జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే మండలాల వారీగా వయోజన విద్య, ఏపీఎంల నేతృత్వంలో రిసోర్స్‌ పర్సన్లు వారికి శిక్షణ ఇచ్చారు. మండల స్థాయిలో ఐసీడీఎస్‌ సీడీపీఓలు, ఎంఈఓలు, డీఆర్‌డీఏ ఏపీఎం, సీసీలను పర్యవేక్షణకు నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే! 1
1/7

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే! 2
2/7

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే! 3
3/7

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే! 4
4/7

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే! 5
5/7

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే! 6
6/7

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే! 7
7/7

నిరక్షరాస్యుల్లో ఉల్లాస్‌మే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement