రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

Published Thu, Jan 30 2025 2:05 AM | Last Updated on Thu, Jan 30 2025 2:05 AM

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

సత్తెనపల్లి: రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా రవాణా శాఖ అధికారి జి. సంజయ్‌ కుమార్‌ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని కాకతీయ కళ్యాణ మండపంలో జిల్లాలోని స్కూల్‌, కాలేజీ బస్సు డ్రైవర్లకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. డీటీఓ సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాల న్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించడం వల్ల విలువైన ప్రాణాలు కాపాడిన వారమవుతామన్నారు. ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు పడే బాధను వర్ణించలేమని చెప్పారు. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థల బస్సు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట, పిడుగురాళ్ల మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఎన్‌.శివనాగేశ్వరరావు, సీహెచ్‌ రాంబాబు, నరసరావుపేట అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు వంశీ, మనీషా, సత్తెనపల్లి టౌన్‌ సీఐ బి.బ్రహ్మయ్య, సత్తెనపల్లి రూరల్‌ ఎస్‌హెచ్‌ఓ పోలూరి.శ్రీనివాసరావులు మాట్లాడారు. విద్యా సంస్థలకు చెందిన బస్సులకు సంబంధించి మారిన నియమ నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ నిబంధనల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం డ్రైవర్లకు బీపీ, షుగర్‌, నేత్ర వైద్య పరీక్షలను ప్రభుత్వ ఏరియా వైద్యశాల వైద్యులు, అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఉచితంగా చేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ సోషల్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు తోట ఆంజనేయులు, రవాణా శాఖ సిబ్బంది, స్కూల్‌, కాలేజ్‌ బస్‌ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా రవాణాశాఖాధికారి సంజయ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement