
పార్వతీపురం: అనుమానంతో భార్యపై ఓ భర్త వేడినీరు పోసి దాడికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణంలోని పైడివీధికి చెందిన తాడంగి ప్రసాద్, దమయంతి దంపతులు టిఫిన్ షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. భార్యపై అనుమానంతో భర్త ప్రసాద్ చీటికీమాటికి ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు.
సోమవారం టిఫిన్ కోసం వచ్చిన యువకుడికి ఆమె పార్సిల్ కడుతుండగా అనుమానంతో వేడినీరు ముఖంపై విసిరికొట్టాడు. దీంతో నుదురు, ముఖంపై గాయాలయ్యాయి. అలాగే వారి కుమార్తె పవిత్రపై కూడా వేడినీరు పడడంతో పలు చోట్ల బొబ్బలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి పుట్టింటి వారు వచ్చి చికిత్సకోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి ఆమెను తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment