ఉపాధి హామీ కార్యాలయానికి తాళం
● జీతాల బిల్లు పంపించడంలో
జాప్యంపై సిబ్బంది నిరసన
సీతంపేట: జనవరి నెల జీతాల బిల్లు ఫీడీఎఫ్ ను డ్వామా పీడీ కార్యాలయానికి పంపించడంలో జాప్యంపై ఉపాధిహామీ సిబ్బంది శుక్రవా రం నిరసన తెలిపారు. స్థానిక ఉపాధిహమీ కార్యాలయానికి కాసేపు తాళం వేసి ఆందోళన చేశారు. ఈ నెల జీతాలు అన్ని మండలాల ఉపాధి హామీ సిబ్బందికి అందాయని, సీతంపే ట మండలానికి మాత్రమే అందలేదన్నారు. ఉపాధిహామీ పనులు జరిపించడంలో ఆదర్శంగా ఉన్నా... జీతాల చెల్లింపులో జాప్యం చేయ డం తగదని క్షేత్రసహాయకులు మురళి, మన్మ థరావు, తేజ తదితరులు ఆవేదన వ్యక్తం చేశా రు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గీతాంజిలి, ఏపీడీ శ్రీహరిలు సిబ్బందిని సముదా యించారు. డ్వామా పీడీతో మాట్లాడి రెండు రోజుల్లో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటా మని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
తాగునీటి కోసం ఏనుగుల విధ్వంసం
భామిని: మండలంలోని ఘనసర–తాలాడ గ్రామాల్లో ఏనుగులు శుక్రవారం విధ్వంసం సృష్టించాయి. మొక్కజొన్న పంటతో పాటు సాగు నీరందించే బోర్లను ధ్వంసం చేశాయి. నీటికోసం బోర్లలోని పైపులను పైకిలాగి కాళ్లతో కుమ్మేయడంతో మొత్తం పాడయ్యాయని రైతు లు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, పాడైన బోర్లు, పంటలకు పరిహా రం అందజేయాలని కోరుతున్నారు.
పోలీస్ జాగిలం ‘వీణ’ మృతి
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖలో స్నిఫర్ డాగ్‌గా విశేష సేవలందించిన ‘వీణ’ వృద్ధాప్యంతో మృతిచెందింది. ఎస్పీ ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో అయ్యన్నపేట శ్మశానవాటికలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ 2014లో ఫిమేల్ స్నిఫర్ డాగ్‌గా వీణ ఇంటిలిజెన్స్ విభాగంలో శిక్షణ పూర్తిచేసుకుని జిల్లాకు వచ్చిందన్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు భద్రత చర్యల్లో చురుగ్గా పాల్గొని, ఎక్స్‌ప్లోజివ్స్‌ను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించేదన్నారు. పోలీస్ డ్యూటీ మీట్స్‌లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్ మైన్స్, ఎక్స్‌ప్లోజివ్ వస్తువులను గుర్తించడంలో చురుగ్గా వ్యవహరించి, పోలీసుల మన్ననలు పొందిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment