● కూటమి శ్రేణుల అత్యుత్సాహం ● ‘దావోస్’ వెళ్లి వచ్చిన
సాక్షి, పార్వతీపురం మన్యం:
ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా దావోస్ వెళ్లారు. పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపు లు జరిపి, రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించామంటూ ఊదరగొట్టారు. ఎవరితోనూ ఒప్పందాలై తే ఒక్కటీ జరగలేదు. అలా అని సంబరాలూ చేసుకోలేదు. అదే బృందంతో దావోస్ వెళ్లి వచ్చిన పార్వతీపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర మాత్రం విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. దావోస్ వెళ్లిరావడం ఒక పెద్ద విజయమంటూ ఆ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. గురువారం జిల్లాకు వచ్చిన ఆయనకు నియోజకవర్గ సరిహద్దు నుంచి భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. దీన్ని గొప్ప ఘన కార్యంగా నియోజకవర్గ కూటమి నాయకులు చెప్పుకోవడాన్ని చూసిన జిల్లా ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు. దావోస్‌కు ఎంతోమంది నేతలు వెళ్లినా ఈ స్థాయి సంబరాలు చేసుకోవడం చూడలేదంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేయడం, కోడ్‌ను ఉల్లంఘించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. దావోస్ వెళ్లి వచ్చారని.. జిల్లాకు గానీ, నియోజక వర్గానికి గానీ ఏమైనా పెట్టుబడులు వచ్చాయా? పరిశ్రమలను తీసుకొస్తున్నారా? అంటే అదీ లేదు. వెనుక బడిన జిల్లా నుంచి అక్కడికి వెళ్లి రావడమే పెద్ద విజయంగా కూటమి నాయ కులు ప్రకటనలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గత ఎనిమిది నెలల కాలంలో నియోజక వర్గ కేంద్రానికి చేసింది ఏమీ లేదు. ప్రభుత్వ వైద్య కళాశాల టెండర్లు రద్దు అయ్యాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఆగిపోయింది. కొత్తగా పరిశ్రమలు ఏమీ రాలేదు. అభివృద్ధిలో పరుగులు పెట్టిన పరిస్థితి కనిపించడం లేదు. సాధించింది ఏమైనా ఉంది అంటే.. చిరుద్యోగుల పొట్ట కొట్టి, వారిని తొలగించి తమ వారిని నియమించడమే. ఇదే కూటమి నాయకుల ఘనతా అంటూ జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.
సాధించినదేమీ లేదు..
సంబరాలంట!
Comments
Please login to add a commentAdd a comment