● గిరిజన ఉద్యోగిని గోడు వినలేరా? ● న్యాయం కోసం అధికారుల
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఆమె ఓ గిరిజన ఉద్యోగిని. తన ఉద్యోగ సమస్యపై నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నారు. మండల అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఉన్నతాధికారులకూ విన్నవించుకున్నారు. పీజీఆర్‌ఎస్‌లోనూ వినతిపత్రం అందజేశారు. ఎక్కడా న్యాయం జరగడం లేదు. సాక్షాత్తూ జిల్లా పాలనాధికారిని కూడా కలిసి పలుమార్లు గోడు చెప్పుకున్నారు. న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినా.. ఇప్పటికీ చర్యలు లేవు. ఎవరూ తన మొర వినడం లేదు. ఇటు ఎక్కడ పని చేయాలో తెలియక.. అటు జీతమూ రాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
జగినది ఇదీ...
గిరిజన యవతి మండంగి బాలాకుమారి గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శిగా 2019లో వీరఘట్టం మండలం చిన్నగోర కాలనీ గ్రామ సచివాలయంలో ఉద్యోగంలో చేరారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన సాధారణ బదిలీల్లో ఆమెను భామిని మండలం కొరమ గ్రామ పంచాయతీకి బదిలీ చేశారు. తనకు చిన్న పిల్లలున్నారని, కుటుంబంలోని పరిస్థితి వివరించి, బదిలీల్లో మార్పు చేయాలని ఆమె అధికారులకు విన్నవించుకున్నారు. దీంతో ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూ అక్టోబర్ నెలలో మళ్లీ వీరఘట్టం మండలం చిన్నగోర పంచాయతీకి మార్పు చేస్తూ శ్రీకాకుళం కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలుత ఆమెను బదిలీ చేసిన భామిని మండలం కొరమ పంచాయతీకి మరో ఉద్యోగిని నియమించారు. సదరు ఉద్యోగి కూడా అక్కడ విధుల్లో చేరిపోయారు.
పాత స్థానాన్ని ఖాళీ చేయని మరో ఉద్యోగి
ఇదే సమయంలో సాధారణ బదిలీల్లో భాగంగా వీరఘట్టం మండలం దశమంతుపురం గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి కర్రి సునీల్‌కుమార్‌కు అదే మండలం చిన్నగోర కాలనీ పంచాయతీకి పోస్టింగ్ వేశారు. ఆ తర్వాత వచ్చిన విజ్ఞప్తుల్లో భాగంగా స్థానాలు మారడంతో మరలా ఆయనను వంగర మండలం నీలయ్యవలసకు బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తర్వాత ఏం జరిగిందో గానీ.. సునీల్‌కుమార్ తనకు మొదట బదిలీ అయిన చిన్నగోర కాలనీ పంచాయతీలోనే కొనసాగుతూ వచ్చారు. బదిలీ ఉత్తర్వులు పట్టుకుని బాలాకుమారి ఆ పంచాయతీకి వచ్చినా.. అక్కడ స్థానం ఖాళీ లేదని, ఆమెను విధుల్లోకి తీసుకోలేదు. ఎంపీడీవోను కలిసి సమస్యను వివరించినా.. పట్టించుకోలేదు. రోజూ ఆమె కార్యాలయానికి రావడం.. అధికారులను కలవడం.. హాజరు వేయడం మినహా ఇతర మార్పులు లేవు. పోనీ, తనకు పోస్టింగ్ ఇచ్చిన భామిని మండలానికి వెళ్దామంటే.. అక్కడ కూడా మరొకరు చేరిపోయారు. ఎంపీడీవోను, జిల్లా అధికారులను కలిసి సమస్య వివరించారు. సాక్షాత్తూ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కూ ఆమె విన్నవించుకున్నా ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు.
ఉద్యోగం లేదు.. జీతమూ పడదు!
నాలుగు నెలలుగా హాజరు వేస్తున్నా.. పై అధికారులు అప్రూవల్ చేయడం లేదు. ఫలితంగా జీతం కూడా రావడం లేదు. ఇప్పుడు ఉద్యోగానికే ముప్పు ఏర్పడడంతో బాలాకుమారి శుక్రవారం మరోసారి కలెక్టరేట్‌కు వచ్చి, తన పరిస్థి
తిని వివరిస్తూ కన్నీరుమున్నీరైంది. ‘సమస్యను శ్రీకాకుళం, పార్వ తీపురం మన్యం జిల్లా కలెక్టర్లకు, రెండు జిల్లాల పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నా పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా
పరిస్థితిని అర్థం చేసుకుని విధుల్లోకి తీసుకోవాలి. అటు ఉద్యో గం లేక, ఇటు జీతం రాక తీవ్ర ఇబ్బందులు పడు తున్నా’ అని ‘సాక్షి’ ఎదుట వాపోయింది. తక్షణమే ఆమెను విధుల్లోకి తీసుకుని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. గిరిజన ఉద్యోగినిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment