మహిళల చేతికి స్టీరింగ్
ముత్తారం(పెద్దపల్లి): మండల కేంద్రంలోని రుద్రమ మండల సమాఖ్యకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు కేటాయించింది. మహిళలను కోటేశ్వర్లును చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో 20 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో మన జిల్లాలోని ముత్తారం మండలానికి ఆర్టీసీ బస్సు కేటాయించారు. శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బస్సును ప్రారంభించారు. ఈ బస్సు నిర్వహణ బాధ్యతలను మండల సమాఖ్య చూసుకుంటుంది. నెలకు రూ.77వేలను ఆర్టీసీ ద్వారా ఎంఎస్‌కు రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఏ పద్మ, సిబ్బంది రాజ్యలక్ష్మి, కవిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు గుర్రాల మహేశ్వరి, ప్రతినిధి రత్న అనిత తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో బస్సు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment