పల్లె నాడీ పట్టేందుకు..
● గ్రామాల బాట పట్టిన సిమ్స్ వైద్య విద్యార్థులు
● ఎంబీబీఎస్ స్టూడెంట్లకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్
● ఒక్కో విద్యార్థికి ఐదు కుటుంబాలు దత్తత
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్
సాక్షి: గ్రామాల్లో మెడికోలు ఏం చేస్తారు?
ప్రిన్సిపాల్: వైద్య విద్యార్థులు గ్రామాల్లో దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు షెడ్యూల్ ప్రకారం కేటాయించిన రోజు వెళ్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు. వ్యక్తుల వారీగా రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు. ఏమైనా సమస్యలు వెలుగులోకి వస్తే ప్రాథమిక సలహాలు ఇస్తున్నారు. అవసరమైతే జీజీహెచ్ బోధన ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్‌లపై అవగాహన కల్పిస్తారు. గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచూ వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు. అన్ని అంశాల్లో వారికి పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు.
కోల్‌సిటీ(రామగుండం): ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్న వైద్య విద్యార్థులు గ్రామాల బాట పడుతున్నారు. కుటుంబాలను దత్తత తీసుకుని పల్లెవాసుల ఆరోగ్య సమస్యలపై ఆరా తీస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సకాలంలో వైద్యచికిత్స పొందే లా సలహాలు, సూచనలు అందిస్తున్నారు గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్– ప్రభుత్వ) కాలేజీ విద్యార్థులు. దత్తత విధానం, అమలు తీరు, దాని ప్రయోజనాలు, లక్ష్యంపై సిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుసింగ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు..
పల్లె నాడీ పట్టేందుకు..
Comments
Please login to add a commentAdd a comment