March 8th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 8th Updates | Sakshi
Sakshi News home page

March 8th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Fri, Mar 8 2024 7:14 AM | Last Updated on Fri, Mar 8 2024 9:53 PM

Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 8th Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

09:50PM, Mar 8th, 2024

తాడేపల్లి :

రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి  ఇంచార్జ్‌లను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ

  • కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య
  • అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్
  • రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావు

09:05PM, Mar 8th, 2024

ఢిల్లీ:

చంద్రబాబుకు నో అపాయింట్‌మెంట్‌

  • అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోసం చంద్రబాబు పడిగాపులు
  • ఈరోజు(శుక్రవారం) బాబుకు దక్కని అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌
  • రేపు (శనివారం) ఉదయం అమిత్ షా ను కలుస్తారని టిడిపి లీకులు
  • ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడి గాపులు
  • ఒడిశా, మహారాష్ట్ర  పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా 
  • అయినా సరే,  పొత్తు ఖాయం  చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్
  • గల్లా నివాసంలో బాబు,  తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు

08:50PM, Mar 8th, 2024

టైమ్స్‌ నౌ-ETG లోక్‌సభ ఎన్నికల సర్వే: ఏపీలో వైఎస్సార్‌సీపీదే హవా

  • మొత్తం 25 సీట్లలో వైఎస్సార్‌సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం
  •  టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్‌
  • వైఎస్సార్‌సీపీకి 49 శాతం ఓటింగ్‌, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం ఓటింగ్‌ పడే అవకాశం ఉందని చెప్పిన సర్వే

07:15PM, Mar 8th, 2024

ఎల్లుండి(ఆదివారం) సీఎం వైఎస్‌ జగన్‌ బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటన 

  • మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ
  • సిద్దం సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు,
  • అక్కడ జరిగే వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ.. సిద్దం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

05:50 PM, Mar 8th, 2024

ఢిల్లీ:

చంద్రబాబు పొత్తుల జాగారం

  • అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కోసం ట్మెంట్ ఉదయం నుంచి ఎదురుచూపులు
  • ఈరోజు అపాయింట్‌మెంట్‌ డౌటే అని అంటున్న బీజేపీ వర్గాలు
  • ఒడిశా, మహారాష్ట్ర  పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా 
  • అయినా సరే,  పొత్తు ఖాయం  చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్
  • గల్లా నివాసంలో బాబు,  తాజ్‌మహల్‌ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు 
  • కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు ‘రాజీ’కీయం
  • స్పెషల్ స్టేటస్‌ను గాలికొదిలేసిన బాబు  
  • సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 
  • 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్ డి ఎ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు 
  • కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి?
  • ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ?
  • మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు 
  • ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు

05:30 PM, Mar 8th, 2024

దాదాపు లక్ష కోట్లు విలువైన స్కామ్‌ చేసిన ఘనాపాటి చంద్రబాబు: సజ్జల

  • 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోయింది
  • ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్ళీ రుజువయింది
  • తెలంగాణ తీర్పును ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?
  • నాలుగు రోజుల్లోనే కథంతా నడిపారు
  • ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారు 
  • 850 ఎకరాల‌ స్థలాలు ఇచ్చేశారు
  • బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఐదు వేల గజాల స్థలం ఇవ్వాలని 
  • గచ్చిబౌలి లో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు 
  • కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారు 
  • లక్ష కోట్ల ప్రాపర్టీ కైవసనికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారు 
  • అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే నాలుగు రోజుల్లోనే పని కానిచ్చారు 
  • వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వలనే చంద్రబాబు బయట పడ్డారు
  • లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టేవారు 
  • అప్పటికీ, ఇప్పటికీ కనీసం చంద్రబాబులో మార్పు రాలేదు 
  • అమరావతిలో కూడా 17 వందల ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారు
  • ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారు 
  • చంద్రబాబు, తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేశారు
  • దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారు 
  • రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారు 
  • స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే తప్పుడు పనులు చేసి జైలు పాలయ్యారు
  • 2015లోనే స్కిల్ స్కాం మొదలెట్టారు
  • అంతర్జాతీయ స్కామ్ స్టర్ చంద్రబాబు 
  • అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్ ని బయటపెడితే, ఇప్పుడు జగన్ అమరావతి స్కామ్ ని బయటపెట్టారు
  • రింగ్ రోడ్డు నుండి అనేక స్కామ్ లను బయటకు తీశారు
  • జగన్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు
  • 2024లో అధికారం ఇస్తే ఇక రాష్ట్రనే కనపడదు
  • అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలు ఇస్తారు
  • అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేస్తారు
  • చంద్రబాబు ఢిల్లీలో చేయని ప్రయత్నం లేదు
  • టీడీపీ అంపశయ్య మీద ఉంది
  • ఆఖరి క్షణంలో చివరి ప్రయత్నంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు 
  • ఈసారి బీజేపీతోపాటు కాంగ్రెస్ ను కూడా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాడు
  • చంద్రబాబు పొత్తులను చూస్తుంటే మాకు ప్రజా బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు
  • అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మని అధ్యక్షరాలిని చేశారు 
  • ఆమె వెనుక నడిపించేవారు వేరే వారున్నారు
  • పొత్తులనేవి చంద్రబాబు బలహీనతకు నిదర్శనం
  • అదే సమయంలో మా బలం కూడా తెలుస్తోంది
  • అన్ని పార్టీల కలిసినా అధికారంలోకి రాలేవు
  • ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీలకు భావసారూప్యత ఏమీ లేదు

03:36 PM, Mar 8th, 2024

తాడేపల్లి :

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు

  • అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ “రీజినల్ కో-ఆర్డినేటర్” గా నియామకం
  • సీఎం, పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం

03:02 PM, Mar 8th, 2024

ఢిల్లీలో చంద్రబాబు పడి గాపులు

  • అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఉదయం నుంచి ఎదురుచూపులు 
  • ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందని సమాచారం ఇచ్చిన టీడీపీ వర్గాలు
  • ఇప్పటివరకు దొరకని అపాయింట్‌మెంట్‌
  • వేరే ప్రోగ్రాం ఉండడంతో బయటికి వెళ్లిపోయిన అమిత్ షా 
  • ఈరోజు కూడా అర్ధరాత్రి వరకు పడిగాపులు తప్పవని చర్చ
  • ఎలాగైనా సరే పొత్తు ఖాయం  చేసుకుని వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్
  •  కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు ‘రాజీ’కీయం
  • స్పెషల్ స్టేటస్‌ను గాలికొదిలేసిన బాబు  
  • సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 
  • 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు 
  • కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి?
  • ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ?
  • మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు 
  • ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు

02:16 PM, Mar 8th, 2024
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని హాట్ కామెంట్స్

  • 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు,లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారు
  • 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడు
  • కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు  దురాశకు పోయాడు
  • అప్పట్లో నాతో మోదీ పై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు 
  • మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు
  • 2019లో జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు 
  • ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది 
  • కేంద్రం నుంచి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ,అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు
  • ఎన్డీఏ నుంచి ఎందుకు బయటికి వచ్చాడో
  • తిరిగి ఎన్డీఏతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి
  • అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి?
  • ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా ?
  • రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా? 
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా?
  • అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా?
  • చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు 
  • తను,తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే చంద్రబాబు భయం
  • టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు 
  • టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది 
  • తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది 
  • 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది 
  • చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం కలే
  • ఎన్నికలయ్యాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతాడు

12:59 PM, Mar 8th, 2024
అనకాపల్లి: దాడి వీరభద్రరావు నివాసానికి కొణతాల

  • దాడి వీరభ్రద్రరావు మద్దతు కోరిన కొణతాల రామకృష్ణ
  • సుదీర్ఘ కాలం రాజకీయ ప్రత్యర్ధులుగా కొనసాగిన ఇరువురు నేతలు
  • కూటమిలో ఓట్లు ఎంత వరకు బదిలీ అవుతాయన్న దానిపై రెండు పార్టీల్లో అనుమానాలు
  • అందుకే పరిధి దాటి రాజీ పడుతోన్న కొణతాల

12:54 PM, Mar 8th, 2024
ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేసే యోచనలో పవన్ కల్యాణ్?

  • రెండింటికీ పోటీ చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనేదాని పై తర్జనభర్జన
  • ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయాలనే విషయంపై సమాలోచనలు
  • ఎన్డీఏ నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో పవన్ కల్యాణ్?
  • ఏ దిక్కు లేకపోతే ఢిల్లీనే దిక్కు కదా.!
  • చీవాట్లు తిన్నది ఎందుకనుకుంటున్నారు.?
  • 24 సీట్లతో ఊరబొడిచేదేమీ లేదు.!
  • ఎన్ని గెలుస్తామో తెలియదు
  • అసలు అభ్యర్థులు ఎవరో చివరిదాకా స్పష్టత లేదు
  • ఇప్పుడు మిగిలిందొక్కటే కమల నాథుల కరుణ కటాక్షం
  • ఎంపీగా గట్టిగా ప్రయత్నిస్తే.. ఓడినా ఢిల్లీ వాళ్లే చూసుకుంటారు
     

12:52 PM, Mar 8th, 2024
రంగాని చంపించింది ఎవరో అందరికి తెలుసు: పోసాని కృష్ణమురళి

  • కాపు సోదరులు రాజకీయంగా ఎంత దగా పడుతున్నారో అవమానపడుతున్నారో వారికీ తెలియాలి 
  • మళ్లీ కాపులను మోసం చేయడానికి వస్తున్నవారిని గుర్తించాలి 
  • కాపుల ఆశ జ్యోతి వంగవీటి.. మాకందరికి ఆయన పెద్ద హీరో 
  • ఆయన్ని ఎలా చంపారో ఈ పోస్టర్ మీకు చెబుతుంది 
  • రంగాను గొంతు కోసి చనిపోయాడా లేదా? చూసి మరి చంపారు 
  • రంగాను చంపించింది చంద్రబాబే
  • రంగాని చంపించింది ఎవరో అందరికి తెలుసు.. వాళ్ల అబ్బాయి కూడా తెలుసు 
  • రంగా ఎమ్మెల్యేగా ఉన్నపుడు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలో 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చేసిన నాయకుడు రంగా 
  • అందుకే అపుడు రంగాను చంపించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు 
  • ఆ రోజుల్లో రంగాను ఎంత హింసించారో అందరికి తెలుసు 
  • తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో సీఎం ఎన్టీఆర్‌, హోం మినిస్టర్ కోడెలకు సెక్యూరిటీ కోసం రంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు 
  • అయినా చంద్రబాబు వల్ల భద్రత రాలేదు 
  • ఇక సెక్యూరిటీ కోసం కేంద్రానికి లేఖ రాసాడు 
  • సెక్యూరిటీ వచ్చేలోపే రంగాను రోడ్డు మీద నరికి చంపించారు
  • రంగా ఉంటే సీఎం అయ్యేవారని కాపులు భావిస్తున్నారు 
  • ఆ తరుణంలో పవన్ కల్యాణ్ వచ్చాడు
  • చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ లను పవన్ తిట్టడంతో కాపులు నమ్మారు 
  • పార్టీ పెట్టాను సీఎం అవుతానని పవన్ అన్నాడు 
  • రంగా తర్వాత కాపు కులంలో పవన్ సీఎం అవుతాడని కాపులు నమ్మారు 
  • కాపులు అంత నమ్మిన వేళ చివరికి చంద్రబాబుకి సపోర్ట్ చేయాలని నాకు అంత సీన్ లేదని పవన్ చెప్తున్నాడు 
  • మోదీ నిజాయితీపరుడు అందుకే సపోర్ట్ చేశాను 
  • తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్‌కు సపోర్ట్ చేశాను 
  • అందరికంటే జగన్ బెస్ట్ కాబట్టి జగన్‌ను సపోర్ట్ చేశాను 
  • పవన్ కళ్యాణ్ నిజాయితి పరుడయితే ఆయనకి సపోర్ట్ చేసేవాడ్ని 
  • రంగాని చంపినా వాడికి ఓటు వేయమని పవన్ చెప్తున్నాడు 
  • ముద్రగడను అవమానించడమే కాక అరెస్ట్ చేయించాడు చంద్రబాబు 
  • కాపు ఆడపిల్లలను అవమానించాడు చంద్రబాబు 
  • అప్పుడు మాట్లాడని పవన్ అవినీతి కేసులో చంద్రబాబు జైలుకి వెళ్లగానే వెళ్లి పలకరించావ్ 
  • కాపులు రౌడీలు గుండాలు అన్న చంద్రబాబుకు ఓటు వేయాలని పవన్ చెబుతున్నాడు 
  • కాపుల్లో చదువుకున్న వాళ్లు లేరా? నీకు చేతకానపుడు కాపుల్లో ఇంకొకరిని పెట్టాలి 
  • రంగాని చంపినా చంద్రబాబును సీఎం ఎలా చేయమంటావ్? 
  • కమ్మ కులంలో పుడితే బాగుండేదని పవన్ ఫీల్ అవుతున్నాడు 
  • రంగాని చంపిన వాడు సీఎం అయితే బాగుంటుందని పవన్ అభిప్రాయం 
  • నేను రంగా శిష్యుడ్ని.. రంగాను అభిమానించే వారు ఎవరైనా సైకిల్‌కి ఓటు వేయకండి

12:06 PM, Mar 8th, 2024
టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

  • 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది?
  • ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు
  • ఈ 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది
  • సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపికే ఓటు వేయండి
     

11:43 AM, Mar 8th, 2024
జనసేన చీరాల ఇన్‌ఛార్జ్‌ ఆమంచి స్వాములు రాజీనామా

  • వ్యక్తిగత కారణాల రీత్యా ఇంచార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
  • పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆమంచి స్వాములు
  • టికెట్ హామీ రాకపోవడంతో రాజీనామా చేసిన స్వాములు
  • స్వాములు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి స్వయాన సోదరుడు

11:36 AM, Mar 8th, 2024
ఢిల్లీ: అమిత్ షా ఇంటి చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు

  • మరోసారి చంద్రబాబు పొత్తు బేరసారాల సమావేశం
  • కాసేపట్లో అమిత్ షా నివాసానికి మళ్లీ బాబు, పవన్ కల్యాణ్ 
  • కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు "రాజీ"కీయం
  • స్పెషల్ స్టేటస్‌ను గాలికొదిలేసిన బాబు
  • సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు
  • 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు
  • కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి?
  • ఇది రాష్ట్ర ప్రయోజనామా? సొంత పార్టీ ప్రయోజనామా? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు
  • ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు

11:07 AM, Mar 8th, 2024
మోసాల బాబూ.. డ్రామాలు ఇక ఆపు: ఎంపీ కేశినేని నాని

  • గొల్లపూడికి దేవినేని ఉమా, వసంత చేసిందేమీ లేదు 
  • వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో నేను ఒక్కసారి కూడా ఎలాంటి శంకుస్థాపన కార్యక్రమాలకు రాలేదు
  • 15 లక్షల జనాభా ఉన్న విజయవాడకు చంద్రబాబు వంద కోట్లు కూడా ఇవ్వలేదు
  • ఫ్లైఓవర్లు.. రోడ్లకు కూడా నేనే ఎంపీగా డబ్బులు తెచ్చా 
  • గొల్లపూడికి సీఎం జగన్‌ రూ. 210 కోట్ల సంక్షేమాన్ని అందించారు 
  • 40 వేల మంది ఉన్న గొల్లపూడిని 60 కోట్లతో తలశిల రఘురాం అభివృద్ది చేశారు 
  • చంద్రబాబుకు మైనార్టీలంటే పడదు
  • చంద్రబాబు వంటి మోసగాడిని నమ్మొద్దు
  • బీజేపీతో చంద్రబాబు ఆడుతున్న నాటకాలను మైనార్టీలంతా గమనించాలి 
  • 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టా
  • ఆ రోజు ప్రధాని మోదీని తిట్టాడు.. ఇప్పుడు మళ్లీ ఆయన చుట్టూ తిరుగుతున్నాడు 
  • ఓట్ల కోసం మైనార్టీలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడో అందరికీ చెప్పాలి
  • నా అమరావతి అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క సెక్రటేరియట్ కట్టలేకపోయాడు
  • సీఎం జగన్‌ 30 వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో సచివాలయాలు కట్టించారు
  • 175కి 175 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయం
  • అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చించేందుకు నేను సిద్ధం

9:34 AM, Mar 8th, 2024
తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ 

  • అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ 
  • తొలి జాబితాలో మండలి బుద్ధప్రసాద్ కు దక్కని అవకాశం 
  • ఉమ్మడి అభ్యర్ధిగా తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్ 
  • పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు ఇచ్చే అవకాశం 
  • అవనిగడ్డ సీటు తమకే  కేటాయించాలంటున్న మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శ్రేణులు
  • ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబు, పవన్‌కు పంపించిన అవనిగడ్డ టీడీపీ నేతలు,కార్యకర్తలు
  • అవనిగడ్డ తమ్ముళ్ల డిమాండ్‌ను పట్టించుకోని చంద్రబాబు 
  • సీటు దక్కే అవకాశం లేకపోవడంతో  పార్టీ కార్యక్రమాలకు దూరంగా బుద్ధప్రసాద్ 
  • నైరాశ్యంలో టీడీపీ క్యాడర్

9:31 AM, Mar 8th, 2024
అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాలు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

  • సీఎం జగన్‌ రోజూ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును, సంస్థలను జాతికి అంకితం చేస్తున్నా సహించలేని స్థితిలో 
  • ప్రతిపక్షాలున్నాయి
  • సీఎం జగన్‌ పరిపాలనలో విద్య, వైద్యం, శాశ్వత అభివృద్ధి పనులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
  • ఏ గ్రామానికి వెళ్లి చూసినా బాగుపడిన పాఠశాలలు, కొత్తగా నిర్మించిన ఆర్‌బీకేలు, సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రేరీలు దర్శనమిస్తున్నాయి
  • చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులను చాలెంజ్‌గా తీసుకుని పూర్తి చేస్తూ వస్తున్న విషయం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా?
  • కరోనాలాంటి విపత్తుతో రెండేళ్లపాటు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నా.. ఎంతో అభివృద్ధి చేశాం
     

8:25 AM, Mar 8th, 2024
బాబు ప్యాకేజీలో భాగమే ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

  • ఆయన వ్యాఖ్యలు రోజూ ఎల్లోమీడియా, చంద్రబాబు గ్యాంగ్‌ చేసేవే... 
  • పీకే ఔనంటే కాదని, కాదంటే ఔనని అర్థం చేసుకోవాలి 
  • తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుపు పక్కా అన్నాడుగా.. ఏమైంది 
  • ఒక పీకే వల్ల ఏమీ కావట్లేదనే ఈ పీకేను చంద్రబాబు తెచ్చాడు 

7:50 AM, Mar 8th, 2024
బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు కాళ్లబేరం

  • బీజేపీతో పొత్తు కోసం తహతహ
  • గంటపాటు అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ పొత్తుల చర్చలు
  • రాజకీయంగా తనకి ఇదే చివరి ఎన్నికలంటూ బీజేపీ పెద్దల వద్ద వేడుకోలు
  • 9 నుంచి 11 లోక్ సభ స్ధానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్ధానాలకి పట్టుపడుతున్న బీజేపీ
  • గత రెండేళ్లగా 11 లోక్ సభ స్ధానాలపై కేంద్ర మంత్రుల ఇన్‌చార్జ్‌లగా పనిచేశామన్న అమిత్ షా
  • విశాఖపట్నం, అరకు, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట, తిరుపతి, హిందూపురం స్ధానాలపై ఫోకస్ పెట్టామన్న బీజేపీ పెద్దలు
  • ఈ స్ధానాలలో 9 లోక్‌సభ స్ధానాలు ఇవ్వాల్సిందేనన్న‌ బీజేపీ పెద్దలు
  • ఎన్డీఏలో చేరడానికి ముందే గతంలో మోదీపై చేసిన విమర్శలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబుకి షరతులు
  • బీజేపీ షరతులకి ఓకే చెబితేనే ఎన్డీఏలో చేర్చుకుంటామని  చంద్రబాబుకి స్పష్టం చేసిన అమిత్ షా
  • బీజేపీ షరతులకి ఓకే చెప్పిన చంద్రబాబు
  • బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేందుకు దాదాపుగా అంగీకరించిన చంద్రబాబు
  • పొత్తు కుదిరితే రేపటి పార్లమెంట్ బోర్డులో అభ్యర్ధులపై ఎంపికపై చర్చించనున్న బీజేపీ

7:33 AM, Mar 8th, 2024
బాబు-దత్తపుత్రుడు మోసాలివిగో.. అనకాపల్లి సభలో సీఎం జగన్‌

  • చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది
  • విశ్వసనీయతలేని మనిషి గుర్తుకొస్తాడు
  • దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తుంది
  • కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది ఈ విలువలు లేని దత్తపుత్రుడేనని గుర్తుకొస్తుంది
  • 2014లో చంద్రబాబు-దత్తపుత్రుడు కలసి ఫొటోలు దిగి సంతకాలు పెట్టి మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తు చేసుకుందామా?
  • రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నారు
  • అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని వాగ్దానాలు చేశారు
  • అప్పట్లో టీవీల్లో ఒక అడ్వరై్టజ్‌మెంట్‌ వచ్చేది
  • ఒక చెయ్యి మెడలో తాళిబొట్టు లాగేది. ఇంకో చేయి వచ్చి పట్టుకుని.. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడని హామీలు గుప్పించారు
  • ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్‌ సిలిండర్లపై  రూ.1,200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో వారిద్దరూ హామీ ఇచ్చారు
  • మహిళల రక్షణ కోసం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు
  • ఆడబిడ్డ పుట్టగానే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామని వాగ్దానం చేసి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు
  • మొదటి సంతకంతో బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామన్నారు
  • పండంటి బిడ్డ అనే పథకం పేరుతో పేద గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తామన్నారు
  • బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్‌ ఫోన్‌ ఉచితంగా ఇస్తామన్నారు
  • మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘కుటీర లక్ష్మి’ అనే వాగ్దానం చేశారు. 
  • 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటైనా చంద్రబాబు, దత్తపుత్రుడు అమలు చేశారా?
  • పొదుపు సంఘాల రుణాలు తీర్చకుండా మోసగించారు
  • అప్పటి దాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్‌ 2016 నుంచి రద్దు చేశారు
  • అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే చంద్రబాబు చోద్యం చూశారేగానీ ఆదుకోవాలన్న మనసురాలేదు.
  • గ్యాస్‌ సిలిండర్ల మీద ఐదేళ్లలో రూ.6 వేలు సబ్సిడీ ఇస్తామని నమ్మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
  • ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సెల్‌ ఏర్పాటు చేయకపోగా విజయవాడలో కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్లు నడిపించారు.
  • మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్‌ చేశారా?
  • అమ్మవారి పేరుతో వాగ్దానాలు చేసి మోసగించి వీరిద్దరూ ఈ రోజు మహాశక్తి అనే కొత్త మోసానికి తెరతీస్తున్నారు
  • బెల్ట్‌ షాపులను రద్దు చేయకపోగా ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం మరో మోసం
  • అవ్వాతాతలకు చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్‌ పెంచడం మరో గజ మోసం
  • ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు
  • బాబు, దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేసి నెరవేర్చింది మాత్రం ఏకంగా పెద్ద సున్నా
     

7:23 AM, Mar 8th, 2024
ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి 

  • రాజకీయపార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ 
  • షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచే ప్రవర్తన నియమావళి అమలు 
  • అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండకూడదు
  • రూ.10 వేలకు మించి విలువైన వస్తువుల రవాణా నిషిద్ధం 
  • స్టార్‌ క్యాంపెయినర్ల దగ్గర రూ. లక్షకు మించి ఉండకూడదు 
  • లోక్‌సభ అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.95 లక్షలు 
  • శాసన సభ అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.40 లక్షలు
  • ఎన్నికల వ్యయంపై ప్రత్యేక ఖాతా నిర్వహించాలి
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా 

7:21 AM, Mar 8th, 2024
175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తాం: ఎంపీ విజయసాయిరెడ్డి 

  • 10న జరిగే సిద్ధం సభకు
  • 15 లక్షల మంది వస్తారు
  • సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సభలో సీఎం జగన్‌ వివరిస్తారు
  • ఎన్నికల్లో గెలిచాక ఐదేళ్లపాటు చేపట్టే కార్యక్రమాలు ప్రకటిస్తారు
  • ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్‌సీపీకి నష్టంలేదు
  • ఆదాయం పెరిగింది కాబట్టే తలసరి ఆదాయం పెరిగింది
  • సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
  • నేతలతో కలసి సిద్ధం సభా ప్రాంగణం పరిశీలన
     

7:10 AM, Mar 8th, 2024
చంద్రబాబు చూపంతా ఢిల్లీ పైనే

  • బాబు పర్యటనపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
  • భయంతోనే ఢిల్లీలో కాళ్లబేరం.. పిలుపు రాకపోయినా వెళ్లి పడిగాపులు!
  • ఒకవేళ పొత్తు ఖరారైతే మరిన్ని సీట్లు కోల్పోతామని కేడర్‌లో భయం 
  • బాబు మాటలను మోదీ, అమిత్‌ షా మరచిపోలేదు 
  • అందుకే పొత్తు పేరుతో ముప్పు తిప్పలు పెడుతున్నారు
  • ఎటూపాలుపోక బాబు తిప్పలు

7:05 AM, Mar 8th, 2024
ఇంతింతై.. ఆకాశమంతై.. 

  • శాసనమండలి చరిత్రలో డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తొలిసారి మైనార్టీ మహిళకు అవకాశం 
  • కేబినెట్‌లో హోం, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖల అప్పగింత 
  • సర్పంచి, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌.. 
  • మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్, మేయర్‌ పదవుల్లో మహిళలకు అగ్రతాంబూలం 
  • నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌ చేస్తూ చట్టం  
  • 1,356 రాజకీయ నియామక పదవుల్లో 688 మహిళలకే.. 

6:51 AM, Mar 8th, 2024
పొత్తుపై నేడు స్పష్టత!

  • అమిత్‌ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ భేటీ
  • తామడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ అగ్రనేతలు
  • ఏపీలో ప్రతిపక్ష పార్టీల పొత్తుల వ్యవహారంలో శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం
  • పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించినట్లు సమాచారం.
  • తమకు 8–10 లోక్‌సభ స్థానాలు, 15–20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెబుతామని బీజేపీ పెద్దలు కరాఖండిగా చెప్పారని తెలిసింది
  • ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై శుక్రవారం ఒక స్పష్టత రానుండగా.
  • సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ పెద్దలతో జరిగిన భేటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement