![BJP activity to stop the failures of BRS - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/3/bjp.jpg.webp?itok=MvJ68ZuV)
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. దక్షిణాదిలో పార్టీ విస్తరణ, తెలంగాణలో అధికార సాధన లక్ష్యంగా కార్యాచరణకు తుదిరూపునిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. రాష్ట్ర పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా (ఎంపీలు సహా) తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధం కావాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆలోచన ఉన్నా.. రెండు రోజులుగా ఢిల్లీలో పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర నాయకుల సమావేశాల సందర్భంగా స్పష్టత వచ్చినట్టు సమాచారం.
బుధవారం దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయినప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నాయకత్వం సన్నద్ధమవుతున్న తీరుపై ఆరా తీసినట్టు తెలిసింది. 2019 ఎన్నికలతో పోలి్చతే దక్షిణాది నుంచి ఎక్కువగా ఎంపీ సీట్లు గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని మోదీ సూచించినట్టు బీజేపీ వర్గాలు చెప్పా యి. ఈ క్రమంలో పార్టీ విస్తరణకు తెలంగాణ అనుకూలంగా ఉందని పేర్కొన్నారని అంటున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవడంలో భాగంగా చేరికల వేగం పెంచాలని.. అన్ని అసెంబ్లీ స్థానాల్లో క్షేత్రస్థాయి నుంచి వివిధరూపాల్లో కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారని వెల్లడించాయి. ప్రధానంగా రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని.. ఆయా చోట్ల తప్పనిసరిగా బహిరంగ సభలు నిర్వహించాలని, వాటిలో ముఖ్యనేతలు పాల్గొనేలా చూడాలని సూచించారని తెలిపాయి.
బీఆర్‌ఎస్ వైఫల్యాలను నిలదీసేలా..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై అంశాల వారీగా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. స్థానికంగా నిరసన కార్యక్రమాలు చే పట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డబుల్ బె డ్రూం ఇళ్లు, దళితబంధు వంటి ప్రధాన అంశాలపై బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేలా కార్యాచరణను రూపొందిస్తోంది.
మరో నాలుగు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఎన్నికల వ్యూహాల అమలుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నా యి. ఈ క్రమంలోనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు, ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాలను పూర్తి చేయాలని నిర్ణయించారు.
నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన
ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వారం పాటు పర్యటించనున్నారు. వారంతా ఏడు రోజులు తమకు కేటాయించిన నియోజకవర్గంలోనే ఉంటారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లలో బసచేసి.. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను పరిశీలించనున్నారు. అనంతరం ఆయా అసెంబ్లీ సీట్లలో పార్టీ పరిస్థితి, ప్రధాన పార్టీల బలాబలాలు, పోటీచేసే అభ్యర్థులు, వివిధ సామాజికవర్గాలు, స్థానిక పరిస్థితులపై జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment