April 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections 2024: Political News Round Up On April 2nd In Telugu | Sakshi
Sakshi News home page

AP Elections Updates April 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌, ఎప్పటికప్పటి సమాచారం..

Published Tue, Apr 2 2024 7:12 AM | Last Updated on Tue, Apr 2 2024 8:44 AM

AP Elections 2024: Political News Round Up On April 2nd In Telugu

AP Political News And Election News April 2nd Telugu Updates

 

8:30 AM, April 2nd 2024

మనం చెప్పిన వాళ్లకే పథకాలివ్వాలి: నారా లోకేష్‌

  • అధికారం లేకున్నా లోకేష్‌ బెదిరింపులు.
  • వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలని బెదిరింపులు.
  • మనం చెప్పిన వాళ్లకే పథకాలు ఇవ్వాలని కామెంట్స్‌
     

8:00 AM, April 2nd 2024
పచ్చ బ్యాచ్‌పై వాలంటీర్ల ఆగ్రహం..

  • చంద్రబాబు బ్యాచ్ కుట్రలపై వాలంటీర్ల మనోవేదన
  • మూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్న వాలంటీర్లు
  • నిన్న మచిలీపట్నం, తాడిపత్రిలో పెద్ద ఎత్తున రాజీనామాలు
  • మచిలీపట్నంలోనే ఏకంగా 1227 మంది రాజీనామా
  • తమను సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంచటంపై ఆగ్రహం
  • పెన్షన్ల కోసం వృద్దులు, వికలాంగులు ఫోన్లు చేస్తున్నాంటూ ఆవేదన

 

7:00 AM, April 2nd 2024
21 కాదు.. 11.. పేరు జనసేనది.. పోటీ టీడీపీనే..

  • పేరే జనసేనది.. పోటీచేసేది టీడీపీనే అంటున్న జనసేన శ్రేణులు
  • ఇవి చంద్రబాబు–పవన్‌కళ్యాణ్‌ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటు
  • జనసేనకిచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలో..
  • వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనలోకి చేరిక
  • తాజాగా.. అవనిగడ్డ, పాలకొండ టీడీపీ నేతలు అలా జనసేనలో చేరి ఇలా టికెట్లు కైవసం
  • గత ఎన్నికల్లో పోటీచేసిన.. లేదా గత ఐదేళ్లలో పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న నేతలు
  • బీజేపీకి కేటాయించిన పది సీట్ల పరిస్థితి కూడా ఇంతేనంటూ కమలదళంలో చర్చ

6:50 AM, April 2nd 2024
తిరుగుబాటుతో తత్తరపాటు..

  • అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే 
  • పింఛన్ల పంపిణీపై వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు 
  • 4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు.. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు 
  • నిమ్మగడ్డ – బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు 
  • బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్‌ 
  • సీఎం జగన్‌ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘ఈనాడు’ రోత కథనాలు 
  • గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండ్‌  
  • లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా?
  • ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు  

 

6:40 AM, April 2nd 2024
టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు 

  • నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు 
  • నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి 
  • మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి 
  • కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులు
  • టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి 
  • అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు 
  • వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలు
  • మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు

6:30 AM, April 2nd 2024
చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నాని

  • వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు
  • ఐదారు నెలల క్రితం వాలంటీర్‌ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా?
  • పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు?
  • వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారు
  • ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా?
  • నిమ్మగడ్డ రమేష్‌కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు
  • ఎన్టీఆర్‌ను కూలదోసింది ప్రజలకు తెలియదా?
  • చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు
  • ఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement